
గోదారి చెంతకు చేరి గుడ్లు పొదుగుతుంది ఈ పులస/ గోదావరి ఎంతో ఇష్టపడే పులస

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కోటిపల్లి ఆగస్టు 17:

ప్లాస్టిక్ వ్యర్థాలు, ఊర్లో చెత్తా,పట్టన్నాలలో చెత్తంతా కాలువలు ద్వారా గోదాట్లోకి , సమద్రమలోకో వచ్చేత్తున్నాయి..వీటికి తోడు సముద్రంలో పెద్ద పెద్ద రిగ్గుల వల్ల వచ్చే ఆయిలు తెట్లు దుర్వసనలు దాటి గోదాట్లోకి రాలేకపోతుంది ఈ పులస .
పులస సముద్రంలో ఉండే చేప. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల నుండి ఖండంతరాలు దాటి వేలమైళ్లు ప్రయాణం చేసి హిందూ మహాసముద్రం గుండా బంగాళాఖాతంలో కలిసే గోదావరి నదిలోకి చొరబడుతుంది . అనేక జలచరాల దాడులు ఎదుర్కొని పులస గోదావరి ప్రయాణం సాగుతుంది. ఉప్పు నీటిలో ఉండే పులస సంతానోత్పత్తికి నదుల్లోకి రావటం జరుగుతుంది . ఆ నదుల్లోకెల్లా ఈ గోదావరి నది అంటే పులస కు ఎంతో ఇష్టం. ఎంతో శ్రేష్టమైన నీటితో పారే గోదారమ్మ చెంతకు చేరి గుడ్లు పాదగడం ద్వారా వరదల సీజన్లో ఎక్కడికక్కడ పులస జాడ ఉండేది . అందువల్ల సులువుగా అందరికీ దొరికేది . ఈ సీజన్ వచ్చిందంటే జాలర్లకు ఓ పండగలా ఉండేది. ఇక భోజనం ప్రియులకు అంతులేని ఆనందం కలిగేది.
ఉప్పు నీటిలో అంటే సముద్రంలో ఉన్నప్పుడు పులస కు అంత రుచి ఉండదు. గౌతమి,వశిష్ట పాయలగుండా నిండు గోదావరిలో ఎదురీదుతూ ఉండటం వల్ల ఆ ఉప్పునీటి శాతం పోయి ఈ గోదారి నీరు కి ఎక్కడలేని రుచి ని సొంతం చేసుకుంటుంది . ఎంత ఎక్కువ దూరం ఎదురీదితే అంత రుచి వస్తుంది. అంటే యానాం నుంచి గోదావరిలోకి ప్రవేశించే పులస ఆ తర్వాత కూళ్ల, కోటిపల్లి,కపిలేశ్వరం, ఆలమూరు, జొన్నాడ,రావులపాలెం,ఊబలంక,ఆత్రేయపురంఅలాగే బడుగువానిలంక, పొట్టిలంక మీదుగా ధవళేశ్వరం బ్యారేజి వరకు మాత్రమే వెళ్ళగలదు . ఆ తర్వాత ఆ బ్యారేజి దాటుకుని వెళ్లే అవకాశం లేదు.ఈ బ్యారేజి కట్టక మునుపు పాపికొండలు మీదుగా భద్రాచలం రాములోరి గుడి వరకూ పులస పయనం ఉండేది . ఇప్పుడు ఆ అవకాశం లేదు. వశిష్ట,గౌతమి పాయలలో బ్యారేజీ దిగువున మాత్రమే దొరుకుతుంది . అంటే యానాం నుంచి ధవళేశ్వరం బ్యారేజి వరకు అలాగే నరసాపురం నుంచి ఈ ధవళేశ్వరం బ్యారేజి వరకు ప్రయాణం సాగుతుంది. ఎంత ఎక్కువ దూరం పయనిస్తే అంత రుచి ఉండడం వల్ల రేటు కూడా ఎక్కడకిక్కడ మారుతూ ఉంటుంది. ఉదాహరణకు గతంలో కేజీ పులస యానాంలో రూ.రెండు వేలు ఉంటే రావులపాలెం వచ్చేసరికి రూ.మూడేలయ్యేది.ధవళేశ్వరం వచ్చేసరికి రూ.నాలుగేలు పలికేది. ..
ఈ ఏడాది యానాం దాటి పులస రాలేదు. యానాం అంటే గోదావరి, సముద్రం కలయిక ప్రాంతం. అంటే పులస అప్పుడే సముద్ర నుంచి గోదావరిలోకి ప్రవేశించే చోటు. అక్కడ దొరికే పులస రుచి అంతంతమాత్రమే ఉంటుంది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గోదావరిలో ఎక్కడా పులస జాడ లేదు . ఎందుకంటే ఈ ఏడాది ఆగస్టు మూడో వారం గోదావరి నీటి ప్రవాహం చాల తక్కువగా ఉంది … ఎక్కడికక్కడ ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. జూలై, ఆగష్టు నెలలలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రోజుకు అదమపక్షం 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసేవారు. ఆ నీటి గుండా పులస ఈ గోదావరిలోకి వచ్చేది . కాని ఈ ఏడాది రోజుకు లక్ష క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయటం తో , ఎగువ ప్రాంతాల్లో తగినంత వర్షాలు లేని కారణంగా ఈ ఏడాది గోదాట్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. మరి మిగిలిన చేపల మాదిరిగా పులస ఇలా తక్కువ నీటిలో ఎదురీదురుతూ రాలేదు. మహాసముద్రంలో జీవించే పులస ఇలా సన్నటి నీటిపాయల్లో చొరపడలేదు . అందుకనే జాలర్ల వలలకుచిక్కడం లేదు. దీంతో ఒడిస్సా ప్రాంతం నుంచి సముద్రంలో దొరికే ఇలసలను గోదారి ప్రాంతానికి తీసుకొచ్చి పులసలాగా అమ్మేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇలసలను తింటూ సరిపెట్టుకోవాల్సి వస్తుంది.. పులస లో ఆడ(సెన),మగ(గొడ్డు) రకాలు ఉంటాయని,దేని రుచి దానికుంటుంది..