V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 20:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వ్యవసాయ పశుసంవర్ధక శాఖల పనితీరు మెరుగుపరి చేందుకు ప్రణాళికాయు తమైన చర్యలు తీసు కుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్ల డించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ వైద్యులు ల్యాబ్ టెక్నీషియన్లు సిబ్బందితో సమావేశం నిర్వహించి ఏడు నియో జకవర్గాలలో ఉన్న వ్యవ సాయ పశుసంవర్ధన డ యాగ్నోసిస్ లాబరేటరీలు పనితీరు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది పలు సమస్యలను ముక్తకంఠంతో జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాం తంగా విరాజిల్లుతున్న కోనసీమ జిల్లాలో ప్రాథమిక రంగ సెక్టార్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు ఏడు నియోజక వర్గాలలోని డయాగ్నోసిస్ లాబరేటరీల భవనాల స్థితిగతులను భౌతికంగా పరిశీలించి అవసరమైన మరమ్మత్తు పనులకు సంబంధించి అంచనాలు రూపొందించా లని పంచాయితీరాజ్ శాఖ ఎస్. ఈ.ని ఆదేశించారు. అదేవిధంగా డయాగ్నో సిస్ ల్యాబ్ లలో ఎక్విప్మెంట్ రిపేర్లు మరియు అవసరమైన ఔషధాలు కొరకు అంచనాల ప్రణాళికలను రచించి ఈనెల 26 నాటికి వాటిని క్రోడీకరించి సమర్పించాలని ఆదేశించారు. పశువుల ఆసుపత్రులను పూర్తిస్థాయిలో నిర్వహిం చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పశు వైద్యులు సిబ్బంది ఖాళీలను నింపి పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అదేవి ధంగా పశు సంచార వైద్య సేవల వాహనాలు పూర్తి స్థాయిలో ఆపరేటింగ్ నిర్వ హించేలా చర్యలు గైకొనాల న్నారు పశు సంచార వైద్య సేవల వాహనాల ఎక్విప్మెంట్ ఔషధాల కొరత ఉన్నట్లయితే వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హెచ్ఆర్ల ఖాళీగా ఉన్నచోట్ల నియమిం చాలని, ల్యాబ్లు పూర్తిస్థా యిలో పనిచేస్తూ పశువుల ఆరోగ్య భద్రత, రక్షణకు మరియు క్రిమికీటకాలు నుండి పంటలను కాపాడేలా లాబరేటరీల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సస్యరక్షణకు సమగ్రంగా చర్య లు గైకొనాలని అధికారులను ఆదేశించారు. అన్ని మౌలిక వసతులు ఎక్విప్మెంట్తో పూ ర్తిస్థాయిలో ల్యాబ్లు ఫంక్షనింగ్ కొరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. పశు వైద్య శిబిరాలు నిర్వహణకు కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా ఆర్థిక సహాయం అంది స్తామన్నారు. హైబ్రిడ్ మేలు జాతి పశువుల ఉత్పత్తి ద్వారా పాడి రైతులకు అధిక ఆదాయం లభించే విధంగా పశువులకు కృత్రిమ గర్భ ధారణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నా రు. పశువులకు ఇంటి వద్ద , వైద్యశాల వద్ద వైద్య సేవలు సత్వరమే అందిస్తూ పశు సంరక్షణకు సహకరించాల న్నారు. వాతావరణ మార్పుల వల్ల పశువులకు ప్రభలే గాలి కుంటు తదితర అంటు వ్యాధుల నివారణ చర్యలు పట్ల పశు వైద్యులు అప్ర మత్తంగా వ్యవహరించాల న్నారు పౌల్ట్రీ పరిశ్రమ సమగ్ర అభివృద్ధికి హేచరీలు తదితర ప్రక్రియల ద్వారా సహకారం అందించి ఆయా రంగ అభి వృద్ధికి తోడ్పాటునoదించా లన్నారు. అంచనాలను ప్రభుత్వానికి నివేదించి నిధులు మంజూరు కోరడం జరుగుతుందని తదుపరి కార్యాచరణ ప్రణాళికలను రచించి అభివృద్ధికి అన్ని విధాల చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జా యింట్ కలెక్టర్ టి నిషాoతి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకట్రావు పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి పశు వైద్యు లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
