
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 05:
రాష్ట్రం లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.కూటమి ప్రభుత్వ పాలనలో గత ఏడాది కాలంలో అభివృద్ది, సంక్షేమం దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని అన్నారు. మండల కేంద్రం రాయవరం, మండపేట మండలం అర్తమూరు, మండపేట పట్టణం 7వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మాదిగ కార్పోరేష్ డైరెక్టర్ మందపల్లి చంద్రశేఖర్ దొరబాబు,కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మార్పులను, ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం చేపట్టిన ప్రతీ పని, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఇంటింటీకీ వెళ్ళి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా పేద బడుగుబలహీన వర్గాల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతీ గ్రామ, ప్రతీ వార్డు సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రతీ నాయకుడు, కార్యకర్త ప్రజా సమస్యలపై దృష్టిసారించాలన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చిన సత్వరమే పరిష్కరించే విధంగా కృషిచేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో గ్రామాలు ఎటువంటి అభివృద్ది చెందలేదన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సవరపు సతీష్, సుబ్రహ్మణ్యం,కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
