కూటమి కల్తీ మద్యం వ్యాపారం – మాజీ మంత్రి గొల్లపల్లి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-మలికిపురం 07:

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆరోపణలు చేశారు.15 నెలలుగా కల్తీ మద్యం వ్యాపారం చేస్తూ… ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పార్టీ కార్యాలయం మలికిపురం నందు మంగళవారం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్య రావు విలేకరుల సమావేశం నిర్వహించారు . ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన గత 15 నెలల నుంచి యథేచ్ఛగా ఆయన అనుచరులు కల్తీ మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ గ్రామాలు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ… పేదలు అనారోగ్యానికి కారణం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కల్తీ మద్యంతో రూ.కోట్లు ఆర్జించారని పేర్కొన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని కూడా సూర్యారావు అన్నారు. కల్తీ మద్యంపై ప్రజలు నాణ్యత పరీక్షలు నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలను మాజీ సీఎం జగన్ అభివృద్ధికి చేశారని సూర్యారావు అన్నారు. మరో 5 వేల కోట్లు వెచ్చిస్తే అవి పూర్త వుతాయని కానీ, చంద్రబాబు నాయకులు ఆ దిశగా కృషి చేయడం లేదన్నారు.
సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు 35 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో జగన్ సృష్టించిన ఈ కాలేజీల సంపదను చంద్రబాబు తన అనుచరులకు దోచి పెడుతున్నారని అన్నారు. ఈ నెల పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో రచ్చబండ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా గ్రామాల్లో ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్లాలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివ కుమార్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య కుమార్, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ నాయకులు తాడి సహదేవ్, కూనపరెడ్డి రాంబాబు, నేతల నాని, మోకా సురేష్, గుర్రం జాషువా, జిల్లెళ్ల ఉదయకిరణ్, గుబ్బల మనోహర్, అడబాల జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

వ్యవసాయ పశుసంవర్ధక శాఖలు పనితీరు మెరుగులు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 20: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వ్యవసాయ పశుసంవర్ధక శాఖల పనితీరు మెరుగుపరి చేందుకు ప్రణాళికాయు తమైన చర్యలు తీసు […]

కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా స్వదేశానికి రాజేంద్రప్రసాద్ మృతదేహం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 28: ఉమెన్ రాజ్యం సూర్ పట్టణంలో రాజేంద్రప్రసాద్ ఆత్మహత్యచేసుకొని మృతిచెందారు.కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా స్వదేశానికి రాజేంద్రప్రసాద్ మృతదేహం చేరింది. డాక్టర్ […]

ప్రతి కుటుంబంలో మాల వ్యాపారవేత్త గా ఒక పారిశ్రామికవేత్త తయారు చేస్తాం: మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 20; షెడ్యూల్ కులాల సహకార సంఘాలకు నూతన జవసత్వాలు తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని రాష్ట్ర మాల సంక్షేమ […]

అయినవిల్లి తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

భారతీయ న్యాయ స్మృతి (భారత న్యాయ సాంహిత – BNS)లోని సెక్షన్ల కింద కేసు నమోదు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, జూన్ 6, 2025 అయినవిల్లి తహసిల్దార్ […]