V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి. గన్నవరం అక్టోబర్ 08:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్(SEC) సభ్యునిగా నియమితులైన నేలపూడి స్టాలిన్ బాబును పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అభినందించారు. హైదరాబాదులో మిథున్ రెడ్డి నివాసంలో స్టాలిన్ బాబు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించారు. వైఎస్ఆర్సిపి నాయకులను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న కూటమి పాలనపై ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు. మిథున్ రెడ్డి పై పెట్టిన అక్రమ కేసులు న్యాయస్థానాల్లో వీగిపోతాయని స్టాలిన్ బాబు అన్నారు.