
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి అక్టోబర్ 01,
ప్రజాస్వామ్యంలో ఒక ఓటుకు ఉండే విలువను ప్రపంచానికి చాటిన ఘనత మాజీ లోక్ సభాపతి జి.ఎం.సి.బాలయోగికి దక్కుతుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ అన్నారు. జి.ఎం.సి.బాలయోగి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ వ్యవహారాల నిర్వహణలో ఆయన నిష్పక్షపాతంగా వ్యవరించిన తీరును శ్లాఘించారు.అధికారాన్ని అభివృద్దికోసం వినియోగించంటంలో బాలయోగి అందెవేసిన చేయి అని వివరించారు.పార్టీ ప్రాంతం అభివృద్ధికి ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శనీయం అని అన్నారు.బాలయోగి ఆశయాలను అమలుచేయటమే ఆయనకు ఘనమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మట్టపర్తి అచ్యుత్,గుమ్మళ్ళ సాగర్, నిమ్మకాయల సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు పాటి వెంకటేశ్వరరావు,బడుగు వెంకటేష్, పినిపే ప్రభు దాసు,తొత్తరమూడి ప్రభాకర్, టిడిపి సీనియర్ నాయకులు పాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.