నిర్దేశిత గడువులోగా పూర్తి నాణ్యత తో పరిష్కార మార్గాలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09:

అర్జీదారుల నుండి అందిన అర్జీలపై సత్వరమే స్పందించి నిర్దేశిత గడువులోగా పూర్తి నాణ్యత తో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

సోమవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కలెక్టరేట్ నందు నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ రాజకుమారి, కలెక్టరేట్ పరి పాలనాధికారి కే కాశీ విశ్వేశ్వరరావు, డి ఆర్ డి ఏ, డ్వామా పథక సంచాలకులు జయ చంద్ర గాంధీ మధుసూదన్లు అర్జీదా రుల నుండి సుమారుగా 215 అర్జీలను స్వీకరించారు.

అర్జీదారుల సంతృప్తే కొలమానంగా అధికారు లు అత్యంత నాణ్యత ప్రమాణాలతో అర్జీలను పరిష్కరించి అవే అర్జీలు అదే అంశంపై పునరావృ తం కాకుండా అప్రమత్తం గా వ్యవహరించాలన్నారు.

అర్జీదారులు మండల స్థాయి సమస్యలను మండల స్థాయిలోనే అందించి పరిష్కార మా ర్గాలు పొందాలన్నారు జిల్లాస్థాయి ఫిర్యాదులను జిల్లాస్థాయిలో సమర్పిం చాలన్నారు.

పాలనను చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలలో కూడా పి జి ఆర్ ఎస్ సేవలను ప్రభు త్వం విస్తరించిందని తెలిపారు.

ఆయా స్థాయి ఫిర్యాదులను ఆయా స్థాయిలలోనే సమర్పించి తగు పరిష్కార మార్గాలు కోరాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, జిల్లా వైద్య సేవలు సమన్వయ అధికారి డాక్టర్ కార్తీక్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని ఈ జ్యోతిలక్ష్మి దేవి, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

రామచంద్రపురం లో గన్నవరపుకు బోస్ ఆశీస్సులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 28: పి.గన్నవరం పై జగన్ ప్రత్యేక దృష్టి: పిల్లి సుభాష్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురంలో గన్నవరపు […]

విద్యా ప్రదాత ఎమ్మెల్యే ఆనందరావుకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 03: డిగ్రీ కళాశాల సాధించిన ఎమ్మెల్యే ఆనందరావును సత్కరించిన దళిత ఐక్యవేదిక అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అవిరామంగా కృషిచేసి […]

రెవెన్యూ సదస్సు. గ్రామంలో పర్యటించిన ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి డిసెంబర్ 19:రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం అయినవిల్లి మండలం విలస గ్రామంలో భూ వివాద సమస్యలు పరిష్కారే లక్ష్యంగా స్థానిక ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ […]