

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి – అమలాపురం సెప్టెంబర్ 29:

జీఎస్టీ సంస్కరణలు ద్వారా ఎన్డీఏ కూటమీ ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం నియోజకవర్గం అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో జిఎస్టి అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త జీఎస్టీ సంస్కరణలు ద్వారా ఎక్కువగా పేద మధ్య తరగతి కుటుంబాల వారు లాభపడుతున్నారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్ర మణి, మున్సిపల్ కమిషనర్ , మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.