V9 ప్రజా ఆయుధం దినపత్రిక -అమలాపురం డిసెంబర్ 14: కోనసీమ జిల్లాలో. పంటలకు సాగు, గ్రామా లకు త్రాగు నీటి విడుదలలో కీలకపాత్ర పోషించే 83 సాగునీటి వినియోగ దారుల సంఘాలు ఏర్పాటు కాబడ్డాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ప్రాదేశిక నియోజకవర్గాలకు,సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు తెలిపారు. గోదావరి మధ్య డెల్టా మరియు గోదావరి తూర్పు డెల్టాలో మొత్తం 990 ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 983 ప్రాదేశిక నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వ హించడం జరిగిందని మిగిలిన ఏడు ప్రాదేశిక నియోజక వర్గాలలోఓటర్లు లేని కారణంగా ఎన్నికలు నిర్వహించలేదని ఆయన తెలిపారు. తథనుగుణంగా 83 సాగునీటి వినియోగదా రుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందన్నా రు. సాగు నీటి సంఘాల ఎన్ని కలతో రైతులకు సకాలంలో సాగు నీరు ఇచ్చేలా పర్య వేక్షణ వ్యవస్థ గతంలో మాదిరిగా అందుబాటులోనికి వచ్చిందన్నారు. పంటలకు సాగు, గ్రామాలకు త్రాగు నీటి విడుదలలో కీలక పాత్ర పోషించే సాగునీటి విని యోగదారుల సంఘాలు ఏర్పాటు అయ్యాయన్నారు. సాగు నీటి సరఫరా కాలువల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరిగి కాలువ చివరి భూము లకు సాగునీరు నీరందించేలా పర్యవేక్షణ చేసేందుకు సాగు నీటి సంఘాలు దోహదం చేస్తా యన్నారు. అదే విధంగా ఇరువురిని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎన్ను కోవడం జరిగిందన్నారు వ్యవసా యం, రైతాంగ సంక్షేమమే పరమావధిగా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, చిట్ట చివరి ఎకరం వరకూ సాగు నీరు సజావుగా పారే లక్ష్యం తో సాగునీటి సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధ రించడం జరిగిందన్నారు. డిసెంబర్ 17, 2024 న డిస్ట్రిబ్యూషన్ కమిటీకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో 83 సాగునీటి వినియోగ దారుల సంఘాలు ఏర్పాటు కాబడ్డాయని జిల్లా: కలెక్టర్
December 14, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
అమిత్ షాను భర్తరఫ్ చేయాలి.
మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. అంబేద్కర్ నినాదాలతో హోరెత్తిన కూడలి. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ […]
శానపల్లిలంక,సిరిపల్లి,మాగం,వేమవరం బట్నవిల్లి గ్రామాల్లో భూములు రైల్వే అధికారులకు అప్పగించండి: కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం,జనవరి 10: కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ లో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని […]
అమలాపురం కలెక్టరేట్ ప్రజా వేదికకు 290 అర్జీలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్-అమలాపురం జూలై 07: అర్జీదారుల సమస్యల పట్ల సత్వరమే స్పందించి తగు పరిష్కార మార్గాలు నూటికి నూరు శాతం సంతృప్తి కరంగా అందించాలని డాక్టర్ బి ఆర్ […]
యువగళానికి రెండేళ్లు రామచంద్రపురం కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రామచంద్రపురం జనవరి 27:యువగళానికి రెండేళ్లు రామచంద్రపురం కూటమి నాయకులు ఆధ్వర్యంలో సంబరాలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ […]