
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 29:

ఫిర్యాదు దారుల అర్జీలు పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధి కారులను హెచ్చరించారు. సోమవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నందు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నిశాంతి, డిఆర్వో మాధవి డ్వామా పిడి మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ లు అర్జీదారుల నుండి సుమారుగా 162 అర్జీలు స్వీకరించారు.

ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో స్వ యంగా మాట్లాడి పరిష్కార మార్గాలు చూపాలని, మన దగ్గరకు వచ్చిన ఫిర్యాదు దారులతో ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలన్నారు. పి జి ఆర్ ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్య మైన పరిష్కారాన్ని చూపాలన్నారు.

ఏ శాఖకు వచ్చిన అర్జీలు ఆయా శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపా లని, వేరే శాఖకు పంపినట్ల యితే కాలయాపనలు జరిగి సమస్యలు ఉత్పన్నమవు తాయన్నారు. వచ్చిన ప్రతి అర్జీని ఒక ఛాలెంజీగా తీసుకుని పరిష్కారం చేసి నట్టయితే జూనియర్ అధి కారులకు మంచి స్పూర్తి కలుగుతుందన్నారు.ప్రజా సమస్యల పరిష్కారవేదిక లో ప్రజలనుంచి, ఫిర్యాదు లు స్వీకరించి, వాటికి సమ ర్థవంతమైన పరిష్కారం నూటికి నూరు శాతం చూపుతూ ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారులలో విశ్వస నీయతను పెంపొందించాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు, శాఖలకు చేరవేస్తూ, చర్యలు తీసు కునే విధానంలో పిజిఆర్ ఎస్ కీలక పాత్ర పోషిస్తుం దన్నారు అధికారులు ప్రజల నుంచి, అర్జీలు స్వీకరించడం ఫిర్యాదులకు తక్షణ స్పందనతో పరిష్కారం అందిస్తూ ప్రజా నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.

గడువు దాటిన అర్జీలు లేకుండా అధికారులు వ్యవహరించాలని, ప్రతి అర్జీకి సరైన ఎండార్స్మెంట్ ఇస్తూ అర్జీని ముగించాల న్నారు ఈ వ్యవస్థ ద్వారా ప్రజా పరిపాలనలో పారద ర్శకత, జవాబు దారీతనం పెంపొందించాలన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సం బంధిత అధికారులపై చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లాస్థాయి అధి కారులు తదితరులు పాల్గొన్నారు.