పి.గన్నవరం నియోజకవర్గం వైసీపీ రథసారధి గా జడ్పిటిసి గన్నవరపు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అంబాజీపేట జనవరి19; డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,
పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అయినవిల్లి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు పేరును ఆదివారం రాత్రి ఆ పార్టీ నిర్ణయించి ప్రకటించిన విషయము తెలిసినదే.ఈ సందర్భంగా జెడ్పిటిసి గన్నవరపు కు నియోజకవర్గం అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు, గన్నవరం మండలాలు నుంచి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో సోమవారం అంబాజీపేట మండలం ఆ పార్టీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రా చంద్రశేఖర్, ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తల నాయకుల మధ్యలో శాలువా పూలమాలలతో అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. ఆయన సందర్భంగా మాట్లాడుతూ… నియోజకవర్గం రథసారథి గా బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉంది అన్నారు. అంబాజీపేట మండల జడ్పీటీసీ సభ్యులు బూడిద.వరలక్ష్మి, అంబాజీపేట మండల ఎంపీపీ దొమ్మేటి. వెంకటేశ్వరరావు, మట్టపర్తి పుల్లంశెట్టి, మట్టపర్తి నాగరాజు, దేవరపల్లి చిన బాలయోగి, గంటి శ్రీనివాసరావు, వనచర్ల. పండు, దంగేటి అబ్బులు, దంగేటి సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాస్ రాజు, నూకపెయ్య సత్యనారాయణ, నాగబత్తుల. శ్రీనివాసరావు, కోట హనుమంతరావు, గుబ్బలనాగ మహేశ్వరరావు, గోగి శ్రీరామూర్తి, గోసంగి కుమారస్వామి, పితానివీరాస్వామి, గోసంగిశ్రీనివాసరావు, దేవరపల్లి రవీంద్ర, బొంతుభాస్కర్, వాసంశెట్టి వెంకన్న, పల్లిరమేష్ బాబు, మట్టపర్తి హరి మాచవరం, పెద్దపూడి, ముసలపల్లి, ఇరుసమండ, వాకలగరువు, తొండవరం, నందంపూడి, మెట్ల కాలనీ ప్రజాప్రతినిధులు, నాయకులు, సచివాలయం కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, వార్డ్ మెంబర్లు, వివిధ బోర్డుల మాజీ అధ్యక్షులు, మాజీ సొసైటీ అధ్యక్షులు, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు, మరియు
అభిమానులు తదితరులు ఉన్నారు.

చివరిలో: మాజీ శాసన సభ్యురాలు పాముల రాజేశ్వరి దేవి, విద్యావేత్త మరియు రచయిత నేలపూడి స్టాలిన్ బాబు, అయినవిల్లి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు పేర్లు పరిశీలించగా గన్నవరానికి గన్నవరపు రథసారథిగా నిలిచారు.

Related Articles

మండల అధ్యక్షుడు మేడిశెట్టి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సభ విజయవంతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అయినవిల్లి మండలం తొత్తరమూడి లో మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ […]

పర్యాటకం,గార్మెంట్స్ తయారీ, పాడి పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలు: ఎమ్మెల్యే ఆనందరావు

వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (విడిపి) విజయవంతం: కలెక్టర్ మహేష్ కుమార్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 15: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో […]