కమ్యూనిస్టు నాయకుడు మచ్చా నాగయ్య మృతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 29:

మచ్చా నాగయ్య మృతి కి పలువురు సంతాపం తెలిపారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మచ్చా నాగయ్య సోమవారం మృతి చెందారు. పోలీసులు స్థానికుల సమాచారం మేరకు నాగయ్య సోమవారం ముక్తేశ్వరంలోగల ఎరువుల దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేసినట్లు తెలిపారు.అయినవిల్లిలంకలోని తనకు చెందిన కొబ్బరితోట లో సదరు మందును కొంతమేర త్రాగినట్లు వివరించారు. అయితే ఆ పురుగులమందు ప్రభావం వల్ల కడుపులో మంట భరించలేక రోడ్డుకు వచ్చి ఈ విషయాన్ని స్థానిక యువకులకు సమాచారం అందించినట్లు తెలిపారు. వారు అంబులెన్స్ లో అమలాపురంలో గల ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు చనిపోయినట్లు వివరించారు.అమలాపురంలోగల ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అందచేసారు. అనంతరం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

నాగయ్య 1963 సం.లో మండలంలోని అయినవిల్లి లంక గ్రామంలో జన్మించారు. ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల లో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించారు. 1974సం.ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం లో ఉమ్మడి రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసారు.తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భారత కమ్యూనిస్టు (ML) పార్టీ మార్కిస్టు లేనినిస్ట్ పార్టీ లో రాష్ట్ర నాయకుడిగా పనిచే‌సారు. అనేక ప్రజా పోరాటాలకు ఆయన సంఘీభావం తెలిపేవారు.ప్రగతిశీల ఉద్యమాలకు మద్దతుదారు గా నిలిచారు. ప్రజా ఉద్యమాలలో మచ్చలేని ప్రజల మనిషి మచ్చా నాగయ్య అకాల మరణం చెందడం ప్రజా పోరాటాలకు విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు అని పలు సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిల్లెల్ల మనోహర్ అమల దాసు బాబురావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఏడిద రాజేష్ ఏ రవి నామాని శ్రీధర్ ముత్యాల శ్రీనివాసరావు పవన్ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండా దుర్గారావు సరేళ్ల దాసు రాష్ట్ర నాయకులు ధీపాటి శివప్రసాద్ విసికె పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ సిపిఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరావు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు శెట్టిబత్తుల తులసీరావు దళిత సేన అధ్యక్షులు మెండి డేవిడ్ అంబేద్కర్ సర్పంచ్ కుమ్మరి మాధవి వెంకటరమణ టిడిపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు శ్యామ్ పిల్లి కన్నబాబు ముత్తబత్తుల శ్రీను సాపే రమేష్ పొలమూరి సందీప్ ఆర్టిసి యునైటెడ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నారాయణ తదితరులు నాగయ్య మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

Related Articles

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్(నిట్, వరంగల్) వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ.

NIT Recruitment Notification: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్(నిట్, వరంగల్) వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ. 👉పోస్టులు: ▪️ విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 01,  ▪️ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 01, ▪️ […]

నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు: చిర్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 03: నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్ […]

ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గా గుబ్బల శ్రీనివాస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 21:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గుబ్బల […]

మడుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 20:పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం మడుపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. స్థానిక మండల ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ […]