V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం సెప్టెంబర్ 11:
మధ్య ప్రదేశ్ కు చెందిన ‘దార్ గ్యాంగ్’ పశ్చిమగోదావరిలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాసారం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంచరిస్తున్నట్లు జిల్లా పోలీసులు వెల్లడించిన క్రమంలో. అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు శనివారం నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తం అవ్వాలని ఆయన కోరారు. రాత్రి సమయంలో ఎవరో కూడా ఒంటరిగా ప్రయాణించకూడదని హెచ్చరించారు.
ఈ గ్యాంగ్ ఒంటరి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తోంది కనుక పోలీసులు విడుదల చేసిన ఫోటోలోని వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే, వెంటనే ఈ 7601047473 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆనందరావు విజ్ఞప్తి చేశారు.