మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 జూలై 10

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జూలై 05:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని ఆదేశించినట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలు జూని యర్ కళాశాలలో ప్రైవేట్ అనైడెడ్ కళాశాలలు పాఠశాలలు ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థలు అన్నింటి లో ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహిం చాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు. కోనసీమ జిల్లాలో 2,150 పాఠశాలలు మరియు ఇతర విద్యా సంస్థలలో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యా హ్నం ఒంటిగంట వరకు 4 గంటలపాటు సమావేశం నిర్వహించాలని ఆదేశిం చారు. తల్లి దండ్రులు విద్యార్థులు అభ్యసన సామర్ధ్యాలు మెరుగు పరచడం మరియు టీచర్లు తల్లిదండ్రులు భాగస్వామ్యంతో విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడమే సమా వేశం ప్రధాన ఉద్దేశమన్నారు .

విద్యార్థుల ప్రగతి మీద 90 నిమిషాల పాటు ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులు సంబంధిత క్లాస్ టీచర్లతో చర్చించాలన్నారు అలాగే సమావేశంలో అందరు ప్రజా ప్రతినిధులను దాత లను విద్యార్థులను తల్లి దండ్రులను భాగస్వా మ్యం చేయాలన్నారు ప్రతి ఒక్క పాఠశాలకు విద్యాశాఖ నుండి కాకుండా వేరే శాఖల నుండి ఒకరిని పరిశీ లకులుగా నియమించా లన్నారు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సభ్యులందరినీ హెచ్ఎం వారి యొక్క లీఫ్ యాప్ లో నమోదు చేయాలని విద్యార్థులు తమ తల్లి పేరు మీద ఒక మొక్కను నాటే కార్యక్రమం గ్రీన్ పాస్పోర్ట్ పేరుతో చేప ట్టాలన్నారు దీనిలో భాగంగా ప్రతి విద్యార్థి లీప్ యాప్ నందు మూడు మొక్కలు ఇండెంట్ కోరాలని సూచించారు ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 1,30 ,000 మొక్కలు సిద్ధం చేయడం జరిగిందని వీటి రవాణా ఖర్చులకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని మాదకద్రవ్యాల నివారణ, సైబర్ క్రైమ్ వంటి అంశా లపై మహిళా పోలీసుల తో ఓరియంటేషన్ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందన్నారు చురుకుగా ఉండే ఇద్దరు తల్లులను రంగోలి వంటి రిక్రియేషన్ క్రీడలు నిర్వ హించాలని సూచిం చారు సైనింగ్ స్టార్స్ సన్మానించే కార్యక్రమం నిర్వహించాలన్నారు తల్లి పేరున విద్యార్థులు తప్పనిసరిగా మొక్కలు నాటే కార్య క్రమం నిర్వహించాలన్నారు.

తల్లిదండ్రులు విద్యార్థులకు ఉపాధ్యా యులకు మధ్యాహ్న సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం కార్యక్రమం ప్రక్రియలో మూడు ఫోటోలు 60 సెకండ్ల నిడివి గల డాక్యు మెంటేషన్ చేసి లీప్ యాప్ నందు అప్లోడ్ చేయాలన్నారు

Related Articles

ఎంపీటీసీ ప్రయాణంతో ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్న జడ్పిటిసి గన్నవరపు

V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా C E O నక్క చంద్ర మెహన్ (M A BED) గన్నవరపు శ్రీనివాసరావు కు శుభాకాంక్షలు తెలిపారు. V9 ప్రజా ఆయుధం దినపత్రిక […]

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 233 ఫిర్యాదులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఏప్రిల్ 28: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో వచ్చే అర్జీదారుల సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తూ […]

మానవజాతి మనుగడకే ప్రాణం పోసిందే మగువ: అచ్చెన్ననాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం మార్చి 08 : మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మగువని మహిళా సాధికారత తోనే స్వర్ణాంధ్ర@2047 సాధ్య పడుతుందని రాష్ట్ర వ్యవ సాయ సహకార […]