
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 26:
ఉత్తర, మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం వాయువ్య, పశ్చిమమధ్య బంగాళా ఖాతంలో వాయు గుండంగా బలపడుతుంద ని శనివారం ఉదయం నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం జిల్లా స్థాయి అధి కారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అక్కడ క్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మండల డివిజన్ జిల్లా కేంద్రాలలో కంట్రోల్ రూమ్ 24/7 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రజలకు వర్షాలు ముoపు మూలంగా ఏ ఇబ్బందులు ఉన్నా ఫోన్ చేసి సహాయం కోరవచ్చునన్నారు మరోవైపు గోదావరి నది పరివాహక ప్రాంతాలలో వరద ఉధృతి కారణంగా ఈనెల 28వ తేదీ నాటికి ధవలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరుకుంటుందని కావున ధవలేశ్వరం దిగువ గోదావరి తీరప్రాంత మండ లాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.