V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, డిసెంబర్ 24:

డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు మండలాల పరిధి లో 54 గ్రామాలకు చెందిన మత్స్య కారులకు ఆరో విడత ఓ ఎన్ జి సి నష్టపరిహారాలు ఈనెల 28 న తాళ్లరేవు మండలం కోరంగి నందు అందించేం దుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు .ఈ మేరకు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ వారి ఛాంబర్ నందు అధికారులతో సన్నద్ధత ఏర్పాట్లపై సమీ క్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఎన్జిసి కే. జీ. బేసిన్ పైప్ లైన్ డ్రిల్లింగ్ కార్యకలాపాలు సమ యంలో మత్స్యకారుల చేపల వేట నిషేధత నష్టానికి గాను ఆరో విడత నష్టపరిహారాన్ని ఈ నెల 28వ తేదీ కోరంగి నందు ఓఎన్జిసి ద్వారా పంపి ణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మత్స్య శాఖల మంత్రి వర్యులు కే అచ్చేన్న నాయుడు, రాష్ట్ర గనులు ఆబ్కారి శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్రలు ముఖ్య అతి థులుగా హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ఏడు మండలాల పరిధిలోని 54 గ్రామాలలో సుమరుగా 16,408 మత్స్య కారులకు ఐదున్నర మాసాలకు గాను ఒక్కొక్కరికి రూ 11,500 చొప్పున రూ 63,250 లను వెరసి మొత్తం రూ 103 కోట్ల 78 లక్షల 600 లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు అదేవిధంగా కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలో 15 గ్రామాలకు చెందిన 7,050 మత్స్య కారులకు నష్టపరి హారాలు చెల్లించనున్నట్లు తెలిపారు. ఇరు జిల్లాల డివి జన్లకు చెందిన ఆర్డీవోలు, డిఎస్పీలు, మరియు జిల్లాకు చెందిన డిఆర్డిఏ, డ్వామా పిడిలు జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్తి సమన్వ యంతో నిర్వహణ ఏర్పాట్లు పటిష్టం గావించి కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మాధవి, డిఆర్డిఏ, డ్వామా పథక సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, ఎస్ మధుసూదన్, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
