
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 21:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, , మోరిపోడు గ్రామ వాసి చెల్లుబోయిన శ్రీనివాసరావు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు.శ్రీనివాస్ పార్థివదేహానికి నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

తదుపరి అక్కడున్న గ్రామస్తులతో ఆయన శ్రీను మరణవార్త ఎంతగానో తనను కలచేసిందన్నారు, వారి మరణం పార్టీకి తీరని లోటని, మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కోల్పోయామని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ కుసుమ చంద్రశేఖర్, రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధి తాడి సహదేవ్, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మోకా సురేష్ , రాజోలు నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షులు జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్, చేనేత విభాగ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీకాంత్, సఖినేటిపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షులు గుర్రం నాగ వెంకట రాజు మరియు మోరిపోడు గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.