ఉద్యోగులు సమస్యలకు ఉంది మీకోసంరెవెన్యూ కేర్ ఓపెన్ హౌస్ గ్రీవెన్స్ !

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 19:

ఉద్యోగుల విధులు నిర్వహణ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అన్ని విధాల సహకారం అందించడం జరుగుతుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా జాయింట్ టీ నిషాoతి రెవెన్యూ పౌర సరఫరాల ఉద్యోగులకు సూచించారు.

శుక్రవారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్ నందు నిర్వహించిన రెవెన్యూ కేర్ ఓపెన్ హౌస్ గ్రీవెన్స్ లో సుమారు 6 మంది ఉద్యోగులు తమ తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ వారికి వ్రాత పూర్వకంగా అందించారు వీటి లో ప్రధానంగా ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు మరియు ఇతర పనుల నుండి విముక్తి కల్పించాలని
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృ శాఖలకు అప్పగించాలని సమయపాలన లేని ఒ త్తిడితో కూడిన విధుల నుండి విముక్తి కల్పించాలని కార్యాలయ పనివేళలు పాటించకుండా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిం చడం, సెలవులు, పండుగ మరియు ఆదివారాలలో బలవంతoగా విధులు చేస్తున్నారన్నారు.

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నోష్నల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలనీ ఆరు సంవ త్సరాల పాటు ఒకే క్యాడర్లో సర్వీస్ చేసిన వారికి AAS ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరా రన్నారు.గ్రామ వార్డు సచి వాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలు అవు తున్న రికార్డు అసిస్టెంట్ క్యాడర్ ను జూనియ అసిస్టెంట్ క్యాడర్ కు మార్పు చేయాలనీ అభ్యర్థించారన్నారు..
అన్నీ విభాగాల వారీగా ప్రమోషన్ ఛానల్స్ ఏర్పాటు చేసి జిల్లాల్ల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలనీ కోరారన్నారు.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్టేషన్ సీనియారిటీ ఆధా రంగా పారదర్శక బదిలీలు జరిగే ప్రత్యేక విధానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పై సమస్యల పై తీవ్ర మనోవేదనకు గురి కావడం జరుగుతుందని దీనికి పరిష్కార మార్గం చూపాలని కోరారు. వీఆర్ఏలు ప్రమోషన్ ఇవ్వాలని ఒక బిఎల్ఓ ఎన్నికల నిర్వహణ సంబంధించి పారితోషం ఇవ్వలేదని ఇప్పించాలని కోరారు. 2022 లో ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన వాహనాల ఎందన ఖర్చులు రూ 1,40,000 బకాయిని వీఆర్వో తిరిగి ఇప్పించాలని కోరారు. మరొక డీసీఎంఎస్ కాంట్రాక్టు ఉద్యోగి తమ సర్వీసులు ఏడాది పాటు పొడిగించాలని కోరారు.

Related Articles

బాణాసంచా పేలుళ్లు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సుభాష్

రాయవరం,అక్టోబర్ 08 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరావతి నుంచి నేరుగా రాయవరం చేరుకున్న మంత్రిక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుబాణాసంచాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం బాణాసంచా […]

జాతీయ కౌన్సిల్ సభ్యులు గా వేమా జీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 02: బిజెపి పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నగరం మాజీ శాసనసభ్యులు నియమితులయ్యారు.ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి […]

తాళ్ళరేవు మండలంలో జగన్ పుట్టినరోజు వేడుకలు

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళ్ళరేవు మండలంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం నిర్వహించారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:రెవెన్యూ అధికారి రాజకుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు–అమలాపురం ఏప్రిల్ 16: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా పలు కార్యక్రమాలను వారి సంక్షేమానికి అమలు చేస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి […]