కొబ్బరి లో కోకో అంతర్ పంటగా సాగు బహు ప్రయోజనకరం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -పి గన్నవరం ఫిబ్రవరి 06:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొబ్బరి లో కోకో అంతర్ పంటగా సాగు చేస్తూ కోనసీమ జిల్లాను కోకో హబ్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలె క్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు సూచించారు గురువారం పి.గన్నవరం మండల పరిధిలోని ముంగండ గ్రామంలో కండవల్లి నాగేశ్వరరావు కు చెందిన కొబ్బరి తోటలలో కోకో అరటి జామ మిరియాలు తదితర అంతర పంటల సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కో కో ఉత్పత్తులకు మార్కెటింగ్ డిమాండ్ తో పాటుగా మంచి గిట్టు బాటు ధరలు లభిస్తున్నాయని ఆ దిశగా రైతాంగం కోనసీమ ప్రాంతంలో అంతర పంటల సాగు ద్వారా కోకో ను అభివృద్ధి చేయాలని సూచించడం జరిగిందన్నారు దీనిలో భాగంగానే క్షేత్రస్థాయిలో కోకో సాగు అంశాలపై విశ్లేషించి సాగు విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసే దిశగా అధ్యయనం చేయడానికి రావడం జరిగిందన్నారు.

కోకో కాయలను ఆయన పరిశీలించి ప్రాసెసింగ్ విధివిధానాలను చాక్లెట్ తయారీ అంశాలను అభ్యుదయ రైతులను అడిగి తెలుసుకున్నారు. కోకో సాగులో తెగుళ్లు వ్యాప్తి సస్యరక్షణ పద్ధతులు సేంద్రియ వ్యవసాయ విధానాలు వంటి అంశాలను కూడా రైతులను అడిగి తెలుసు కున్నారు. రాలిన చెట్ల ఆకులు దుక్కులో కలిసిపోయి భూమి సారవంతమవుతుందని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.

క్రిమి కీటకాలు తోటలలో ఆశించిన సందర్భంలో అందరూ రైతులు ఏకకాలంలో క్రిమిసంహారక మందు లను పిచికారి చేస్తేనే ఆ యొక్క తెగుళ్లు నివారిం చుకోవచ్చునని లేని పక్షంలో ఎవరో ఒకరు క్రిమి సంహారక మందులు పిచికారి చేసిన ప్రక్క తోటల నుండి మళ్లీ అదే తెగుళ్లు వ్యాప్తికి ఆస్కా రం ఉంటుందని అందు చేత రైతులు ఏకకాలం లోనే క్రిమిసం హారక మందులు పిచికారి చేయవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వారికి వివ రించారు. వర్షాలు పడితే తెగుళ్లు నివారించబడతాయని రైతులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి బివి రమణ తాసిల్దార్ పి శ్రీ పల్లవి ఉద్యాన అధికారి దిలీప్, ఖండవిల్లి నాగేశ్వ రరావు రైతులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఘనంగా S C C డైరెక్టర్ చెల్లి అశోక్ జన్మదిన వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం జూలై 15: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

సంక్షేమ వసతి గృహాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 02: సంక్షేమ వసతి గృహాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి పథకంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సంపూర్ణంగా అందించాలని ఆహార భద్రత […]

ఎమ్మార్వో వి ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉప్పలగుప్తం డిసెంబర్ 30: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గ్రామం లో రీ సర్వే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ర్యాలీ […]

ఎన్డీఏ అభ్యర్థి పేరాబత్తులను గెలిపించండి: నక్క సునీల్ రాజ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అయినవిల్లి ఫిబ్రవరి 15: ఉభయ గోదావరి ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని నక్క సునీల్ రాజు కోరారు. డాక్టర్ బి […]