
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు జనవరి 23: గన్నవరపు సూర్యనారాయణ కళ నెరవేరబోతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా అయినవిల్లి మండలం జెడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. గురువారం రాజోలు నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ మరియు ఉమ్మడి ఆంధ్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ను గన్నవరపు శ్రీనివాసరావు మలికిపురం వైస్సార్సీపీ పార్టీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు, గన్నవరపు ను శాలువా పూలమాలలతో సత్కరించి అభినందిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ.. తండ్రి గన్నవరపు సూర్యనారాయణ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్ని ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఈ స్థాయికి చేరుకున్నందుకు నాకు ఎంతో సంతోషం ఇస్తుందని ఆయన అన్నారు. మీ తండ్రి సూర్యనారాయణ నాకు సోదర సమానుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నాడని మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి మనసులో స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో పి.గన్నవరం నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బి ఫామ్ం చేతికి వచ్చినట్లు వచ్చి చే జారిందని, ఆయన గుర్తుచేస్తూ.. తండ్రి గన్నవరపు సూర్యనారాయణనను గుర్తు చేస్తూ ఇంత కాలానికి తండ్రి కల నెరవేస్తున్న కుమారుడుగా నిన్ను చూస్తే ఎంతో ఆనందం వేస్తుందని అభినందిస్తూ కౌగిలించుకుని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పాటి శివకుమార్, అయినవిల్లి మాజీ దేవస్థానం చైర్మన్ గుత్తుల నాగబాబు, తోరం భాస్కరరావు, నెల్లి దుర్గా ప్రసాద్, పొలమారు గోపాల్, తోరం గౌతమ్, పులిదిండి ప్రభాకర్, సాకా నాగేంద్ర, దేవరపల్లి రవీంద్ర మరియు తదితరులు ఉన్నారు.