
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 15:
ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు తావులేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, పేదలకు అన్ని అవసరాలకు ఉపయోగ పడే విధంగా బియ్యం కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలి పారు. సోమవారం స్థానిక అమలాపురం మహిపాల వీధి సమతా నగర్ 9 10 వార్డు లలో సుమారు 376 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శ కతతో రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ఆధారిత డైనమిక్ కీ రిజిస్టర్తో వీటిని అనుసంధానం చేశార న్నారు. రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టవచ్చని వీటిని ఐడెంటిటీ కార్డుల కింద కూడా వినియోగించు కోవచ్చన్నారు. స్మార్ట్ ఈ- పోస్ మిషన్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తేనుందని, ఇప్పుడిస్తున్న స్మార్ట్ కార్డులను ఈ యం త్రం ద్వారా స్వైప్ చేస్తే కార్డుదారుడి వివరాలు వస్తాయన్నారు. సిమ్, వైఫై, హాట్స్పాట్, బ్లూ టూత్, టచ్ స్క్రీన్ వంటి ఆధునిక సదుపాయాలతో, ఆండ్రా యిడ్ సాంకేతికతతో పని చేస్తుందన్నారు. వేలిముద్ర పడకున్నా యంత్రంలో కెమెరా ద్వారా ఐరిస్ స్కాన్ చేయవచ్చన్నారు. తాజా పరిణామాలతో రేషన్ పంపిణీ వ్యవస్థ నూతన సాంకేతిక మార్పులతో అత్యంత పకడ్బందీగా మారనుందన్నారు. ప్రభు త్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రజల కోసం ఎన్నో పథ కాలను తీసుకొచ్చి సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఇప్పటి వరకు దీపం పథకం, తల్లికి వందనం, శ్రీ శక్తి, రైతుల కోసం అన్నదాత సుఖీభవ లాంటి ఎన్నో పథకాలను అమలు. చేస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం స్మార్ట్ రేషన్ కార్డును కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభు త్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ పథకా లను ప్రజలు సద్వినియోగ పరచు కోవాలని కోరారు.
స్థానిక అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టెక్నాలజీని ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న మొట్టమొదటి సీఎం చంద్రబాబునాయుడన్నారు రేషన్, సరకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ, రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారు లకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపా రు. గతంలో మాదిరి పెద్ద పుస్తకాల్లా కాకుండా ఏటీఎం కార్డు, ఆధార్ కార్డుల తర హాలో జేబులో ఇమిడి పోయే విధంగా రాజ ముద్రతో పాటు లబ్దిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామన్నారు కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ సరకుల వివరాలు, కేటాయించిన పరిమాణం, రేషన్ పొందిన స్థితి, డిపో వివరాలు తెలుస్తాయ న్నారు. అంతేగాక రాష్ట్రం లో ఎక్కడే వారైనా, ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామ న్నారు రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పోస్ యంత్రాలను కూటమి ప్రభుత్వం ఆధుని కరించిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం గా జాతీయ ఆహార భద్రతా చట్టం అనుసరించి పేద ప్రజానీకానికి సక్రమంగా రేషన్ సరకుల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజల కోరిక మేరిక ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి మళ్లీ రేషన్ డీలర్ వ్యవస్థను అందుబాటులోకి తీసు కొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే మాధవి, డీఎస్ఓ ఏ ఉదయభాస్కర్, నాయ కులు మెట్ల రమణబాబు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డి రాంబాబు, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తాసిల్దార్ అశోక్ ప్రసాద్, వార్డ్ కౌన్సిలర్లు దుర్గాబాయి విజయలక్ష్మి హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ ఆర్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొ న్నారు.