సమన్వయంతో పేదరికం లేని సమాజ స్థాపన దిశగా పనిచేయాలి: ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09;

స్వర్ణాంధ్ర దార్శనికత కు అనుగుణంగా ఆశించిన వృద్ధిరేటును సాధించేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలలో ఉన్న వనరులు ఆధారంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పేదరికం లేని సమాజ స్థాపన దిశగా పనిచేయాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు.

రాష్ట్రవ్యా ప్తంగా స్వర్ణాంధ్ర @2047 సాధన దిశగా జిల్లా, నియోజకవర్గ వారి దార్శని కథ యూనిట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలన మరియు అధికారులు ప్రజా ప్రతి నిధుల సమన్వయంతో క్షేత్రస్థాయి నుండి పనిచేసేలా జిల్లా, నియోజ కవర్గ వారీగా బృందాలను ఏర్పాటు చేసి అభ్యుదయ పథంలో రాష్ట్రా న్ని నడిపించేలా ఈ యొక్క యూనిట్లను ఏర్పాటు చేయ డం జరిగిందని, ఆయా నియోజకవర్గాలలో ఉన్న వనరులను ప్రజానీకం అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక అస మానతలు లేని సమాజ స్థాపన దిశగా సమిష్టిగా పని చేయాల్సి న ఆవశ్యకతను గూర్చి ముఖ్యమంత్రి కూలంకంగా వివరించారు.

ఇప్పటికీ బృందాలకు సిబ్బందిని నియమించి పంపించడం జరిగిందని తెలిపారు ఇరువురి సమన్వయంతో ఉన్న వనరుల ద్వారా మరియు ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో పి 4 పెద్ద గేమ్ చేంజర్ని తద్వారా పేదరి కం లేని సమాజ స్థాపనకు ముందడుగు వేయాలని దిశా నిర్దేశం చేశారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య కర సమాజ స్థాపనకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తదితర ఫౌండేషన్ల ద్వారా సమాజంలో వృద్ధిరేటు సాధన ఉద్యోగాలు కల్పనకు ప్రతి నియోజకవర్గంలో జిల్లా స్థాయి అధికారులను విశ్వ విద్యాలయాలు విద్యా ప్రాప్తికి సంబంధించిన ప్రొఫెషనల్ నియమించామని వారు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించి అనుమతులు కోరుతూ సమగ్ర అభివృద్ధికి పాటు పడాలన్నారు.

అదేవి ధంగా సంపదను సృష్టించి మెరుగైన జీవన ప్రమాణాలు ప్రజలకు కల్పించాలన్నారు. ఆకాశ మీ హద్దుగా పనిచేయా లని సూచించారు. ఈ యొక్క వినూత్న విధానం ద్వారా సత్ఫలితాలు తీసుకుని రావాలని ఆయన ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, సిపిఓ మురళీకృష్ణ, నియోజక వర్గాలకు నియమించిన సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

అంగీకారశృంగారం.అత్యాచారం కాదు హైకోర్టు తీర్పు:V9

ఇరువురు అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక,అత్యాచారం దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను, ఉద్దేశపూర్వకంగా వేధించేందుకు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది. రేప్ కేసును కొట్టేయాలంటూ ఓ యువకుడు దాఖలు […]

విజయవాడలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా శనివారం ప్రారంభించారు.విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ తదుపరి […]

అరటి నారతో ఖరీదైన వస్తువులు తయారీ కేంద్రం ఆసక్తికరంగా అమలాపురం కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24 అరటి ఫైబర్ యూనిట్లు స్థాపించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారీ ద్వారా స్థానిక ప్రజానీకానికి జీవనో పాదులు మెరుగుపరచాలని డాక్టర్ […]

రామచంద్రపురం నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

•రామచంద్రపురం నీటి సంఘం అధ్యక్షులుగా బిక్కిన జగన్నాధ రావు.•ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాసరావురామచంద్రపురం 14 డిసెంబర్ ప్రజా ఆయుధం ::అంబేద్కర్ కోనసీమ జిల్లాడిసెంబర్ 14 వ తేదీ శనివారం రామచంద్రపురం,తోటపేట,వేగాయమ్మ పేట,వెలంపాలెం,వెల్ల నీటి వినియోగ దారుల […]