
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-
కాట్రేనికోన/ ముమ్మిడివరం/ ఉప్పులగుప్తం,మే 30,202

గత కొద్ది రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉండుట వలన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన ముమ్మిడివరం ఉప్పలగుప్తం మండలాలలో లైన్ వెంబడి చెట్ల కొమ్మలు మరియు కొబ్బరి ఆకులు లైనుకు అతి సమీపములో వచ్చుట వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుచున్నది. దీనిని నివారించడానికి రెగ్యులర్ వారాంతపు నిర్వహణ లో బాగముగా వినియోగదారులకు నాణ్యమయిన మరియు నిరంతర విద్యుత్ సరఫరా చేయుట కొరకు ఉప్పలగుప్తం ముమ్మిడివరం కాట్రేనికోన మండలాలలో విద్యుత్ తీగల కు సమీపములో ఉన్న చెట్ల కొమ్మలు, కొబ్బరి ఆకులను మరియు పాదులను తొలగించడము జరిగినది. ఇది సాధారణంగా విద్యుత్ సరఫరా నిర్వహణలో భాగంగా తరచుగా జరిగే కార్యక్రమమని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరిండెంట్ ఇంజనీర్ యస్ రాజబాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. .