
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 15:

అర్జీల పరిష్కారంలో ఖచ్చితమైన స్పష్టత ఉండాలని ఆర్జీలు పునరావృతమైతే సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పూర్తి భాధ్యత వహించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి సూచించారు. సోమవారం స్థాని కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్ష తన నిర్వహించి సుమారుగా 260 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల పరిష్కారం లో స్పష్టత తప్పని సరని ఆర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులు భాధ్యత వహించాల్సి వస్తుందని ఆమె అధికారులను ఆదేశించారు .

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు అత్యంత చేరువు గా సుపరిపాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఆధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలకు పరిష్కరం చూప డంలో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్జీల పరిష్కారంలో స్పష్టత ఉన్నప్పుడే పరిష్కారం అవుతాయని, లేదంటే సమస్య పునరావృత మవుతూనే ఉంటుందన్నారు.

పిజిఆర్ఎస్ వ్యవస్థపై ప్రజల పెట్టుకున్న నమ్మకా నికి మరింత బలం చేకూ ర్చేలా అధికారుల పనితీరు ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రంపై అధికారులు దృష్టిపెట్టి నిర్దేశ గడువు లోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు, అర్జీ స్వీకరిం చింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్క రించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీ తనానికి ప్రాధాన్యమిచ్చేలా, ఆర్జీలు పరిష్కరించాలని ఆమెవెల్లడిoచారు.

డిఆర్వో మాధవి మాట్లాడుతూ అర్జీలు పరిష్కార తీరు పారదర్శకత, నాణ్యత ఉండాలని ప్రజా సమస్యలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ వేసి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికా రులు వారి వారి శాఖలకు సంబంధించిన ఆర్జీలను క్షణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా పరిష్కార చర్యలు తీసుకోవాలని అన్నాడు. కొన్ని సంద ర్భాల్లో ఫిర్యాదులు పరిష్కారానికి కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదు దారులతో అధికారులు మాట్లాడితే వారికి కొంత ఊరట కలుగుతుండ న్నారు.

ఫిర్యాదులు తమ పరిధిలోనివి కానప్పుడు వెంటనే సంబంధిత శాఖకు ఎండా ర్స్మెంట్ చేసి పంపాలని, కాలయాపన చేస్తే ఫిర్యాదుదారులు అసం తృప్తి చెందుతారని ప్రత్యేక దృష్టి ష్టి సారించాలని ఆదేశించారు. అవేశించారు.అర్జీలు ఆర్జీలు ఓపెన్ కాకుండా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారుల ను ఆదేశించారు.

ఈకార్యక్రమంలో డ్వామా పి డి మధుసూదన్ సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, ఎస్టిసి పి కృష్ణమూర్తి, డి ఎల్ డి ఓ వేణుగోపాల్ వివిధ శాఖ జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.