
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 16:

డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం స్థానిక కొంకపల్లి భూపయాగ్రహారం దగ్గర దళిత సేన ఆధ్వర్యంలో దళిత సేన అధ్యక్షుడు మెండి డేవిడ్ అంబేద్కర్ అధ్యక్షతన బొజ్జా తారకం వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.డేవిడ్ అంబేద్కర్ మాట్లాడుతూ అణగారిన ప్రజల ఆశాజ్యోతి,దళిత,పౌర హక్కుల నాయకుడు,ప్రజా న్యాయవాది,రిపబ్లికన్ పార్టీ నాయకుడు,కవి, రచయిత గొప్ప వక్త బొజ్జా తారకం మన నుంచి భౌతికంగా దూరమై తొమ్మిదేళ్లు దాటింది. ఇంకా ఆయన స్ఫూర్తి సమాజంలోని పీడిత ప్రజల ప్రేమికులకు, ప్రగతిశీల శక్తులకు బాసటగా నిలుస్తూనే ఉంది. బొజ్జా తారకం 1939 జూన్ 27న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కందికుప్ప గ్రామంలో బొజ్జా అప్పలస్వామి-మావుళ్ళమ్మ దంపతులకు కనిష్ట పుత్రుడిగా జన్మించారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా ప్రజానీకానిది”అని కవి కాళోజి అన్నట్లుగా బొజ్జా తారకం విద్యార్థి దిశ నుంచి తుది శ్వాస విడిచే వరకు పీడిత ప్రజల అభివృద్ధి కోసమే పోరాడి ఒక ఉజ్వల చరిత్రను మన కళ్ళ ముందు నిలిపారు. ఆయన వెలుగులో జరిగిన పోరాటాలైన కారంచేడు, తిమ్మసముద్రం,పదిరికుప్పం, చుండూరు, లక్ష్మీదేవి పేట పోరాటాలకు అయిన నాయకత్వం వహించారు. సమాజంలోని ప్రగతిశీల శక్తుల సంఘీభావం సంపాదించారు. న్యాయస్థానాలలో ఆ సంఘటనలోని దోషులను శిక్షించే విధంగా నికార్సైన ఉద్యమ కారునుడిగా, పీడిత ప్రజల హక్కుల న్యాయవాదిగా అలుపెరగని పోరాటం చేశారు. ఒక వైపు న్యాయస్థానంలో ప్రజల వైపు నిలబడి అత్యంత నైపుణ్యంతో వాదనలు కొనసాగిస్తూనే, మరోవైపు అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారు. తారకం గారి 2014 లో బ్రెయిన్ ట్యూమర్ వ్యాధికి గురయ్యారు ఆఖరి క్షణంలో కూడా రోహిత్ వేములకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇటు న్యాయస్థానంలోనూ,అటు ప్రజాక్షేత్రంలోనూపోరాడారు. సెప్టెంబర్ 16,2016 రాత్రి 9 గంటలకు తుది శ్వాస విడిచారు. తారకం మన మధ్యన భౌతికంగా లేకపోయినా పీడిత ప్రజల పట్ల ఆయన నిబద్ధత, ఆయన ఆచరించిన విలువలు, చేసిన న్యాయ, ప్రజా పోరాటాలు చిరకాలం సజీవంగా ఉంటాయని డేవిడ్ అంబేద్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వాకపల్లి హరీష్ కుమార్, సాపే రమేష్,బుసి రాంబాబు, గోసంగి సంతోష్,కమిడి సామ్యూల్ జ్యోతి,గోసంగి జాకోబ్ ప్రభు, కుమ్మరి రవితేజ,మాకే భవాని ప్రసాద్, మాదే విజయ్ కుమార్ తదితులు పాల్గొన్నారు.