

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి సెప్టెంబర్ 12:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ ఆధ్వర్యములో తాగు నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు.

స్థానిక ప్రధానోపాధ్యాయులు జనిపల్లి బాలకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా లింక్ వెల్ టెలిసిస్టమ్స్ సీనియర్ మేనేజర్ రామం మాట్లాడుతూ.. పిల్లలు అందరూ ఆరోగ్యంగా వుండాలని ఎలాంటి కలుషితం లేని స్వచ్ఛమైన నీళ్ళు తాగినప్పుడే ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఎదుగుదల వుంటది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంఈఓ లు శ్రీనివాసరావు లు మరియు కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదివి వారు అనుకున్న గోల్ రిచ్ అవుతారని అన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ చదవాలని సోషల్ మీడియా కి దూరంగా వుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.