
విజయవాడ: ఏపీ భాజపా (బిజెపి) అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చింది. అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన.. గతంలో శాసన మండలిలో భాజపా ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. మాధవ్.. భాజపా సీనియర్ నేత, దివంగత చలపతిరావు కుమారుడు. ఆయన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.