79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గతంలో కన్నా భిన్నంగా వినూత్నంగా ఆహుతులను ఆకర్షించాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 24 :

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గతంలో కన్నా భిన్నంగా వినూత్నంగా ఆహుతులను ఆకర్షించే విధంగా నిర్వహించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్ల పై ఆయన జిల్లా స్థాయి అధి కారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతి ఈవెంట్ సజా వుగా నిర్దేశిత వ్యవధిలో నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

సంక్షేమ శాఖలు తమ పరిధిలోని సంక్షేమ పథకాల అమలు తీరు ప్రస్ఫుటంగా ప్రతి బింబిం చేలా శకటాలను రూపొం దించి ఉత్తమమైన ప్రదర్శ నలు నిర్వహించాలన్నారు. విద్యాశాఖ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలని పోలీస్ శాఖ జిఎంసి బాల యోగి స్టేడియం నందు పెరేడ్ నిర్వహణ,జాతీయ పతాక కవాతు గౌరవ వందన స్వీకరణ శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ వంటి చర్యలు చేపట్టాల న్నారు. జీరో పేదరికం సాధ నకై రూపొందించిన పి4 పథకం అమలుపై ప్రత్యేక పోకస్ పెట్టి శకటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు అదేవిధంగా విదేశాలకు ఉద్యోగరీత్యా వలసలు వెళ్లే కోనసీమ ప్రజల సౌకర్యార్థం దిక్సూచిగా, జిల్లాకే తలమాని కంగా నిలిచేలా స్థానిక కలెక్టరేట్లో నెలకొల్పిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కేంద్ర కార్యకలా పాలపై ఒక శకటాన్ని రూపొందించాలని సూచిం చారుఅన్ని రకాల ఈవెంట్లు క్రియేటివిటీని తలపించే విధంగా వినూత్నంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

వివిధ శాఖలలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాల జారీకై త్రిసభ్య కమిటీని నియమించడం జరిగింద న్నారు. ప్రతి శాఖలో ఉత్తమ సేవలందించిన ఇరువురికి మాత్రమే ప్రశంసా పత్రాలు జారీ కొరకు ప్రతిపాదనలు పంపాలని ఆయన స్పష్టం చేశారు. ఒక గంట సమ యం మాత్రమే ప్రశంసా పత్రాల పంపిణీకి కేటా యించడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాన్ని నిర్వహించాలని జిల్లా ఆర్థిక గణాంక శాఖ మరియు డిఐపిఆర్ఓ సం యుక్తంగా జిల్లా ఇన్చార్జి మంత్రివర్యుల 79వ స్వా తంత్ర దినోత్సవ జిల్లా అభివృద్ధి సంక్షేమ సందే శాన్ని రూపొందించాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి విశ్రాంతి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు,, డిఆర్ఓ బి ఎల్ ఎన్ రాజకుమారి జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

ఆ రెండు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం

రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రెండు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సాయం ప్రకటించారు. జనసేన పార్టీ […]

త్వరలో ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు: అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి ఆగస్టు 14: ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు త్వరలో అందుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు […]

మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని పెంపొందించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జనవరి 7: విద్యాబోధనతోపాటు ఆసక్తిగల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని , పోటీతత్వాన్ని అలవర్చుకొని జిల్లా యొక్క ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇనుమడింపచేయాలని […]

ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్ వినయ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి ని జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు. డాక్టర్ […]