
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 70:

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్య మైన పంట బీమా పథక మని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సోమవారం స్థానిక అమలాపురం అంబేద్కర్ కోనసీమ కలెక్టరేట్ నందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రచార పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊహించని వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు లేదా వ్యాధుల కారణం గా పంట నష్ట పోయిన రైతులకు ఆర్థిక సహా యాన్ని అందించడానికి ఈ పథకం దోహదపడుతుం దన్నారు. రైతులు ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని పంటలకు నష్టం వాటిల్లిన సందర్భంలో బీమా పరిహారా లను వివిధ దశలలో పొంద వచ్చునన్నారు రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిం చాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటలకు బీమా మొత్తంలో గరిష్టంగా 2% మరియు రబీ పంటలకు 1.5% చెల్లిస్తారన్నారు. వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% వరకు ప్రీమియం ఉంటుందని. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్రంరాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయ న్నారు.లోటు వర్షపాతం లేదా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విత్తడం నాటడం కుదరకపోతే బీమా కవరేజ్ ఉంటుం దన్నారు.ప్రకృతి వైప రీత్యాలైన వరదలు, కరువు, వడగళ్ల వాన, తుఫాను, అకాల వర్షాలు, తెగుళ్లు మరియు వ్యాధుల వల్ల పంట నష్టం జరిగితే కవరేజ్ లభిస్తుందన్నారు
పంట కోసిన తర్వాత పొలంలోఆరబెట్టడానికి ఉంచిన పంటలకు తుఫానులు, అకాల వర్షాల వల్ల నష్టం జరిగితే బీమా వర్తిస్తుందను,వడగళ్ల వాన, జలమయం కావడం ప్రమాదాల వల్ల కలిగే నష్టాలకు కూడా బీమా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసు బాబు, ఎల్ డి ఎం కేశవ వర్మ, ఉద్యాన అధికారి బి.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.