ప్రకృతి సేద్య విధానాలను అవలంబించి రైతుల ఖర్చు తగ్గించాలి: కలెక్టర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట,ఆలమూరు సెప్టెంబరు 08 :

వరి సాగులో ప్రకృతి సేద్య విధానాలను అవలంబించి రైతుల ఖర్చు తగ్గించడంతో పాటుగా లాభాన్ని పెంచే నానో యూరియా వాడాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రైతులకు పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో వరి పంట సాగు క్షేత్రాలలో ఆ యన విస్తృతంగా పర్య టించి రైతులతో సాగు విధానాలు పెట్టుబడి ఖర్చులు, దిగుబడులు, సస్యరక్షణ, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకం వివిధ రకాల పంటల సాగు పరి మితులు అంశాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పంటల సాగులో నానో యూరియా వాడడం ద్వారా వాస్తవ ప్రభావం రైతులకు ఉంటుందన్నారు.


రైతులకు నానో యూరియా ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తోందనీ యూరి యాకు ప్రత్యామ్నాయం కాకపోయినా, సాంప్రదాయ ఎరువులతో పాటు వాడి నప్పుడు రైతులకు 25 శాతం వరకు యూరియా పొడుపు అవకాశం కల్పి స్తుందన్నా రు. స్థానిక రైతులు తాడి రామ చంద్రారెడ్డి సత్య సతీష్ రెడ్డి దమ్ము సత్య నారాయణ లను వెదజల్లే విధానం, నాట్లు వేసే విధానం గూర్చి అడిగి తెలుసుకున్నారు. వారు సాగు విధానాలు తెలుపుతూ మొదటి దశలో 30 కేజీలు రెండవ దశలో 30 కేజీలు మూడవ దశలో 15 కేజీలు యూరియాను వినియోగించడం జరిగిం దని ప్రస్తుతం పంట పొలా లు చిరుపోట్ట దశలో ఉన్నాయని ఈ సీజన్లో ఇక ఎరువుల అవసరం లేదని తెలిపారు, ఆలమూరు సొసైటీ నుండి ఎరువులను తీసుకోవడం జరిగిందని రబి సీజన్లో సీజన్లో 5 దపా లు ఎక్కువ మోతాదులో వాడడం జరుగుతుందన్నారు.

మరి ఎక్కువగా యూరియా వాడటం వల్ల పోడ తెగులు వంటివి వ్యా ప్తికి ఆస్కారం ఉంటుంద న్నారు. ఎరువులను అవ సరాన్ని బట్టి వాడడం జరుగుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో వరిగడ్డిని పాడి రైతులు వచ్చి పంట పొలాల్లో స్ట్రాబెల్లర్ గా చుట్టి పశు వులకు మేతగా వేసుకుంటారన్నారు. రబి సీజన్లో ఎరువులు మోతాదు ఎక్కువగా వాడటం వల్ల గడ్డిని పశువులకు మేతగా వేయడానికి రైతులు ఇష్ట పడరన్నారు. స్వర్ణ ఎమ్ టి యు 1318 రకాలు ఖరీఫ్లో సాగు చేయడం జరిగిందని స్వర్ణ కోత సమయంలో నేల నంటే స్వభావం ఉందని ఎం టి యు 13 18 వర్షాలకు గాలికి తట్టుకొని ఉంటుం దన్నారు. స్వర్ణ రకం ఎం టి యు 13 18 కంటే కాలప రిమితి 15 రోజులు తక్కు వన్నారు. ఖరీఫ్ లో ఎక రాకు దిగుబడి 35 బస్తాలు కాగా రబీలో 55 బస్తాల వరకు దిగుబడి వస్తుందన్నారు.

మూడో పంటగా 20 రకాల అపరాల కిట్టు వాడడం జరుగుతుందని అయితే రబి సీజన్లో సాగు క్షేత్రాలను హార్వెస్టింగ్ మిషన్లు తిరిగేందుకుగాను ఆరబెట్టిన పిదప హార్వె స్టర్లతో కోతలు కోయడం వల్ల భూమి ఆరిపోయి అంతగా అపరాల మొల కలు రావడంలేదని రైతులు తెలిపారు. డ్రోన్ల సహా యంతో నానో యూరియా డిఎపి వాడటం బాగానే ఉందని కానీ రైతులలో డ్రోన్ల వాడకంపై ఒక అపోహ ఉం దని డ్రోన్లు ఎంత ఎత్తులో నుండి పిచికారి చేయాలి ఎన్ని లిటర్ల నీటిలో కలిపి మందులు పిచికారి చేయాలన్న సందేహాలు ఉన్నాయన్నారు పంట చిన్న సైజులో నాలుగు అడుగులు ఎత్తు నుండి మధ్య వయసులో ఆరడుగుల ఎత్తు నుండి డ్రోన్లు పిచికారి చేయవ చ్చునని డ్రోన్ ఆపరేటర్లు సూచించారన్నారు. డ్రోన్ వినియోగం వల్ల లేబర్ చార్జీలు తగ్గడంతోపాటు రెండో దఫాలో నానో యూరియా వాడడం వల్ల సాధారణంగా వాడే యూరియా వాడకం 30 కేజీలు మిగులు తుందన్నారు.

నానో యూరియా పిచికారీకి మాన్యువల్ గాను ద్రోన్లతోను కేవలం రూ 400 మాత్రమే ఖర్చవుతుం దన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ జిల్లాలో రైతాంగం అవసరాల మేరకు ఎరువులకు సరఫరా సక్రమంగా జరుగుతోందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు రైతులు ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ విధానాలు నానో యూరి యా డిఏపి వాడకం పై దృష్టి సారించి రసాయన ఎరువు లు వాడకాన్ని బాగా తగ్గించి భూసారాన్ని పరిర క్షించుకో వాలని సూచించారు. అదే విధంగా సగటు మానవుని జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రకృతి సేంద్రియ విధానాలు అమితంగా దోహదపడతా యన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి శ్రీకర్ తహసిల్దారు ప్రకాశ రావు జిల్లా వ్యవసాయ అధికారి వి బో సుబాబు, మండల వ్యవసాయ అధికారి టీ మీనా. రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

డాక్టర్ పి ఎస్ శర్మ కు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అభినందనలు

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, మార్చి 03: 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ లో క్షయ […]

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు.. మంత్రి వాసంశెట్టి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం/ కే గంగవరం,జూన్1 ,2025 చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రతినెలా 1 నుంచి […]

రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -కే గంగవరం, జనవరి 24; రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. […]

ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సముద్ర తీరం వెంబడి ఓఎన్జిసి ఇతర చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికి […]