
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబరు 09:

ఈనెల 11 వ తేదీ గురువారం నుండి జిల్లావ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం రేషన్ డిపోల వద్ద పండగ వాతా వర ణంలో జరుగుతుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పౌరసరఫరాల అధి కారి ఏ ఉదయభాస్కర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాలకు సుమారు 5,31,926 వచ్చాయని తెలిపారు. వీటిని సంబంధిత తాసిల్దార్లు కు అప్పగించడం జరిగిందన్నారు. రేషన్ డీలర్లు సచివాలయ ఉద్యోగుల సమన్వయంతో ఈనెల 11వ తేదీ నుండి సంబంధిత మంత్రులు శాసనమండలి శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులు సమక్షంలో డిపోల వద్ద పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. తదుపరి రేషన్ షాపుల వద్ద ఈ స్మార్ట్ కార్డులను కార్డుదారులకు పంపిణీ చేస్తారన్నారు. వృద్ధులు వికలాంగులు మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్ద రేషన్ కార్డులు ఇస్తారన్నారు పేద కుటుంబాలకు రేషన్ సరు కులు పంపిణీని స్మార్ట్ కార్డుల ద్వారా ఆధునికరిం చడం జరిగిందన్నారు లావాదేవీలలో పారద ర్శకతను పెంచుతూ ఆధునిక సాంకేతికతతో తయారు చేసి, వాటిలో ప్రముఖమైన ఫీచర్ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డులు చిన్న పరిమాణంలో, తయారీ పరంగా ఏటీఎం కార్డు మాది రిగా ఉంటాయన్నారు కార్డు పై ప్రభుత్వ అధికారిక చిహ్నం, కార్డుదారు ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు, QR కోడ్ కనిపిస్తాయనీQR
కోడ్‌ని స్కాన్ చేస్తే వివరాలు నేరుగా లబ్ధిదారుడికి కనబ డేలా ఉంటుందన్నారు రేష న్ పంపిణీలో అవకతవకలు తగ్గుతాయని.రేషన్ సరు కులు ఇవ్వడానికి లబ్ధి దారుడి వివరాలను డిజి టల్‌గా ట్రాక్ చేయడం వీలౌతుందన్నారు లబ్ధిదారుడు కార్డు తీసు కునే సమయంలో ఆధార్ ఆధారంగా OTP లేదా బయోమెట్రిక్ ద్వారా ప్రమాణీకరణ జరుగుతుం దన్నారు ,రేషన్ సరుకుల తేలికపాటి పంపిణీ, కరోనా వంటి పరిస్థితుల్లో కూడా, సులభంగా రేషన్ సరుకులు పొందడానికి వీలవుతుంద న్నారు.ప్రభుత్వ పథకాల అర్హతకు మార్గమని తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ వంటి సంక్షేమ పథకాల లో లబ్ధిదారులను గుర్తించ డానికి ఈ స్మార్ట్ కార్డ్ ఆధార మన్నారు కార్డ్ లో పేరు మార్పు, చిరునామా సవరణ, సభ్యుల చేర్పు వంటి పనులు సులభంగా చేయవచ్చునన్నారు.గతంలోని రేషన్ కార్డుల స్థానం లో ఇప్పుడు పూర్తిగా స్మార్ట్ కార్డులు అమలు జరుగు తోందన్నారు. ప్రజలకు మరింత సురక్షితమైన పారదర్శకమైన, ఆధునిక రేషన్ సేవలు అందించ డానికి స్మార్ట్ కార్డు విధానం ముఖ్యమైన అడుగన్నారు.