రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -కే గంగవరం, జనవరి 24;

రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పర్యటించి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులకు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందన్నారు. పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి ,పశుపోషణ ఖర్చులు తగ్గించడానికి , పశుసంవర్ధన సేవలను పశుపోషకులకు మరింత చేరువు చేయడానికి జనవరి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోందని .. పశుపోషకులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో తేలికపాటి శస్త్ర చికిత్సలు, గర్భకోస వ్యాధులకు పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందించడం, ఎదలో ఉన్న పశువులను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం, చూడి పరీక్షలు నిర్వహించి శాస్త్రీయ సూచనలు ఇవ్వడం లాంటివి చేస్తారన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. పశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా అన్ని గ్రామాలలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పశుపోషకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పశువులు ప్రమాదవశాత్తు మరణించిన యెడల పశుపోషకులు ఆర్థికంగా నష్టపోకుండా పశువులకు బీమా తీసుకోవాలన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మేలు జాతి పెయ్యదూడలు పుట్టించడం ద్వారా గ్రామాలలో మేలు జాతి పశుసంపదను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా నామమాత్రపు ఫీజుతో లింగ నిర్ధారిత వీర్యాన్ని అందిస్తోందని.. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుపోషకులకు 70% రాయితీపై పశుగ్రాస విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతోందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో గతంలో కొంతమంది భూములను కబ్జా చేశారని.. వారి నుంచి భూమిని తిరిగి తీసుకొని అర్హులైన రైతులకు అందించేలా చర్యలు చేపడతామన్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి కొనియాడారు. అనంతరం మంత్రి మినరల్ మిక్సర్ పౌడర్, కాల్షియల్ టానిక్స్ తదితరాలను రైతులకు అందించారు.


ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు మూర్తి, సహాయ సంచాలకులు కృష్ణ, ఎంపీపీ పంపన నాగమణి,సత్యవాడ గ్రామ సర్పంచ్ సలాది వెంకన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

20వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష : జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 18: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, డాక్టర్ బి.ఆర్ […]

జక్కంపూడి రాజా కు పాపా రాయుడు సంఘీభావం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 22:మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు రాష్ట్ర వైసిపి కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం లో మంగళవారం ఆయనను […]

జీరో పేదరికమే లక్ష్యంగా పి 4 రీవాల్యుడేషన్ గ్రామ సభలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 25: జీరో పేదరికమే లక్ష్యంగా పి 4 రీవాల్యుడేషన్ గ్రామ సభలు రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి, అర్హులను వారి […]

కాగిత రమణ కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎడిటర్ వినయ్ కుమార్

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 20: కాగిత రమణ కుటుంబాన్నికి ప్రజా ఆయుధం మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బి ఆర్ […]