ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు.. మంత్రి వాసంశెట్టి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
రామచంద్రపురం/ కే గంగవరం,జూన్1 ,2025

చౌక ధరల దుకాణాలను పునః ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

ప్రతినెలా 1 నుంచి 15 వరకు రేషన్ దుకాణాలలో రేషన్ ..

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ తీసుకోవచ్చు..

వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ

గతంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా తరలింపు..

ఎండియు ఆపరేటర్లకు వాహనాలు ఉచితంగా ఇచ్చాం.. వారి ఉపాధికి ఎటువంటి ఇబ్బంది లేదు..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులు, రేషన్ దుకాణాలకు రాలేని వారికి ఇంటి వద్దనే రేషన్ అందించడం జరుగుతుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం మంత్రి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రపురం పట్టణంలోని ముచ్చుమిల్లులో చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రేషన్ డీలర్ కొమ్మన సూర్యకుమారి రేషన్ దుకాణాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాలను పునః ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతినెల 1 నుంచి 15 తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని.. లబ్ధిదారులు వీలున్నప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవచ్చు అన్నారు. గతంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇవ్వడం మూలంగా.. ఎండియూ ఆపరేటర్లు ఏ సమయంలో తమ వీధిలోకి వస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వాహనాలు తమ వీధిలోకి వచ్చిన ఎండలో నిలుచుని రేషన్ తీసుకోవలసిన పరిస్థితి ఉండేదన్నారు. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారన్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, ప్రజలు వారి తీరిక సమయంలో రేషన్ తీసుకోవడానికి వీలుగా తిరిగి రేషన్ దుకాణాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎండియు ఆపరేటర్లకు వాహనాలు ఉచితంగా ఇచ్చామని వారి ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించలేదన్నారు . రామచంద్రపురం అర్బన్ మరియు రూరల్ లో మొత్తం 58 చౌక దుకాణాలు ఉన్నాయని .. వీటి ద్వారా 34,738 మంది లబ్ధిదారులు రేషన్ పొందనున్నారన్నారు. వీరిలో 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు దివ్యాంగులు 5531 కార్డులు ఉన్నాయన్నారు.. వీరందరికీ ఇంటి వద్దనే రేషన్ అందిస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీరిక సమయాలలో వెళ్లి రేషన్ తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

రామచంద్రపురం న్యూ డివిజనల్ అధికారి డి అఖిల మాట్లాడుతూ.. ఎం డి యు ఆపరేటర్లు ఏ సమయంలో వస్తున్నారు తెలియక లబ్ధిదారులు రేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో తిరిగి రేషన్ దుకాణాలను పునః ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి 8 వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు దివ్యాంగులకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించడానికి రేషన్ డీలర్లు ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్నారు. రేషన్ షాపులలో ఎలక్ట్రానిక్ కాటా ఉంటుందని బరువులో తేడా ఉంటే ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు ధరల పట్టిక కూడా సంబంధిత షాపుల బయటే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం మంత్రి కే గంగవరం మండలం గంగవరంలోని డీలర్ తులసి వెంకటలక్ష్మి షాపును ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు..

ఈ కార్యక్రమాలలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణమూర్తి, కే గంగవరం ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఆర్ఓ మృత్యుంజయరాజు ,రామచంద్రపురం డిప్యూటీ తాసిల్దార్ మాధురి, కే గంగవరం ఎంపీటీసీ పంపన నాగమణి ,సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

మహాత్మాగాంధీ సేవలు, త్యాగాలు, ఆహింసా సిద్ధాంతాన్ని గుర్తు కలెక్టర్ మహేష్ కుమార్

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 02: గాంధీజీ జయంతి మనకు మానవతా విలువలు, శాంతి, సత్యం, అహింసా మార్గాల పట్ల నిబద్ధతను గుర్తు చేస్తుందని డాక్టర్ బి ఆర్ […]

రాహుల్ గాంధీపై కేసు నమోదు

పోలీస్ స్టేషన్లలో రాహుల్ పై FIR ఫైల్ చేశారు.తోపులాటలో గాయపడిన MP ప్రతాప్ చంద్ర సారంగి హాస్పిటల్లో చేరారు. మరో MP ముఖేష్ రాజ్పుత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు: చిర్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 03: నియోజకవర్గ పరిశీలకులు గా ఒంటెద్దు వెంకయ్య నాయుడు ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వెల్లడించారు. డాక్టర్ బి.ఆర్ […]

పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 01: పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని స్వ ర్ణాంధ్ర @ 2047 […]