రాజ్యాంగం అంటే స్వేచ్ఛా భారతం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 26:

స్వేచ్ఛా భారతంలోని ప్రతి పౌరునికి స్వేచ్ఛా యుతమైన జీవనాన్ని వ్వాలన్న సంకల్పంతో రాజ్యాంగ రచన జరి గిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం జి ఎం సి బాలయోగి క్రీడా ప్రాంగణం నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రం ఘనంగా నిర్వహించిoది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న బ్రిటీషు రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందన్న నేతల అభిప్రాయం మరియు స్వాతంత్య్ర సముపార్జన అనంతరం మన దేశానికి పటిష్టమైన రాజ్యాంగo ఉండాలని సంకల్పంతో నూతన రాజ్యాంగ రచనకు సన్నాహాలు ప్రారంభిoచి. భారత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, స్వేచ్చా, హక్కులు, మౌళిక సదు పాయాలు తదితరాలను దృష్టిలో ఉంచుకుని భారత రాజ్యాంగ రచనకు రూపకల్పన చేశారన్నారు.

భారత రాజ్యాంగం ద్వారా భార తదేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చిందన్నారు శాసనసభల రూపకల్పన తో పాటు కోట్లాదిమంది పీడిత ప్రజల ఆశయాల ను ప్రతిబింబించేలా అతి పెద్ద రాజ్యాంగాన్ని లిఖించారన్నారు రాజ్యాంగం అంటే దేశానికి ప్రజలకు ప్రభుత్వానికి దిక్సూచి, మరియు కరదీపిక లాంటి దన్నారు. సర్వ సత్తాక సౌర్య భౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేస్తోందని అందుకని రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్ట మైన స్థానం లభించిం దన్నారు మన రాజ్యాం గం ఉన్నత విలువలు కలిగిందంటూ మన్న నలను కూడా పొందిందన్నారు.

కుల విభిన్న మతాల రకరకాల కట్టు బొట్టు ఆచార్య వ్యవహా రాలతో సంఘటిత భారత దేశానికి స్వపరిపాలన రూపకల్పనను రాజ్యాంగ బద్ధం చేశారన్నారు భార తదేశంలో అధికారానికి ప్రజలే మూలాధారమ న్నారు. ప్రజలందరికీ ప్రాథమిక హక్కుల తో పాటుగా ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం చేకూరుతుందన్నారు. తొలుతగా బాలయోగి క్రీడా ప్రాంగణం నందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల పేరెడ్ గౌరవ వందనం స్వీకరించారు సాయుధ పోలీస్ ,ఎన్. సి.సి క్యాడెట్ల సాంప్ర దాయ కవాతు గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు

తదుపరి జిల్లా అభివృద్ధి మరియు సంక్షేమంపై ప్రగతి సందే శాన్ని వివరించారు. తదుపరి వివిధ పాఠశా లలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతి ప్రదర్శనలు విశే షంగా ఆహుతులందరినీ అలరించాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో డాగ్ శాండీ, డాగ్ స్పైడర్ షోలలో గౌరవ అతిధులను నమస్కరించి చేసిన విన్యా సాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతి కార్యక్రమా లైన గేయ నృత్య రూపక, రోప్ మాల్కo ప్రదర్శనలలో గుడిమేల్లంక జిల్లా పరి షత్ హై స్కూల్ విద్యార్థుల రోప్ మాల్కం ప్రద ర్శనకు ప్రథమ స్థానం, దేశం మనదే గేయ నృత్య రూప కానికి శ్రేయ దివ్యాం గుల పాఠశాలకు ద్వితీయ స్థానం లభించగా జడ్పీహెచ్ఎస్ పీ గన్నవరం విద్యార్థులకు ఇదే మన భారతం గేయ నృత్య ప్రదర్శనకు తృతీయ స్థానం లభించింది. సాంస్కృతి కార్యక్రమాల్లో పాల్గొన్న మిగిలిన టీములకు ప్రోత్సాహక బహుమతులను బహుకరించారు.

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా లకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించగా శకటాల ప్రద ర్శనలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు ప్రథమ స్థానం,జిల్లా నీటి యాజ మాన్య సంస్థ శకటానికి ద్వితీయ స్థానం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఉద్యాన శాఖ సంయుక్త శకటానికి తృతీయ స్థానం లభిం చింది.విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 305 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుక రించారు భారత రాజ్యాం గంపై ఇటీవల నిర్వహించిన క్విజ్ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావుపార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ జిల్లా జాయింట్ కలెక్టర్, టీ నిషాoతి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అడ్మిన్ ఎస్పీ ప్రసాద్, డిఆర్ఓ రాజకుమారి ఆర్డీవోలు కే మాధవి పి శ్రీకర్ డి అఖిల,జిల్లా స్థాయి అధి కారులు, సిబ్బంది, ప్రముఖ వ్యాఖ్యాత జి వి ఎస్ సుబ్ర హ్మణ్యం వికాస జిల్లా మేనేజర్ జీ రమేష్ వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

అమలాపురం ముఖద్వారం ఈదరపల్లి వంతెన/సులభతరంగా రాక పోకలు సాగించే విధంగా కలెక్టర్ ఆదేశాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కలెక్టరేట్ అమలాపురం జులై 30: అమలాపురం ముఖద్వారం ఈదరపల్లి వంతెనకు ఇరు వైపులా (ఎగువ దిగువ) పురపాలక సంఘo, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ […]

డిప్యూటీ ఎంపీడీవో మంగాదేవి ఆకస్మిక మృతి పై పంచాయతీరాజ్ ఉద్యోగులు సంతాపం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 22: అమలాపురం డిప్యూటీ ఎంపీడీవో మంగాదేవి ఆకస్మిక మృతి పై పంచాయతీరాజ్ ఉద్యోగులు దిగ్భ్రాంతి చెందారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

3,4 తేదీల్లో మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షులు (చైర్మన్) డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ జూలై, 3, […]

గుత్తుల సాయి గారు ను మర్యాదపూర్వకంగా కలిసిన V9 మీడియా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ముమ్మిడివరం జూలై 21: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం నుంచి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా […]