
పార్టీ అధిష్టానానికి టిడిపి సీనియర్ నాయకుల విజ్ఞప్తి.
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీలకు కేటాయించాలని మండల టిడిపి సీనియర్ నాయకులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అయినవిల్లి సర్పంచ్ కాకర బాబ్జి ఇంటి వద్ద ఎస్సీల సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎఎంసి డైరెక్టర్ మోర్త సత్తిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన 27 దళిత పథకాలను పునరుద్ధరించిన తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దళిత తేజం తెలుగుదేశం స్ఫూర్తిని గ్రామ గ్రామాల్లో విస్తరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీలు అధిక సంఖ్యలో కలిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్సీలకు జిల్లా అధ్యక్షస్థానాన్ని కేటాయించడం ద్వారా దళిత సామాజిక వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. అంతేకాకుండా పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందనే భరోసా ఇచ్చినట్లు అవుతుందని వారు వివరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ మెజార్టీ స్థానాలను కైవశం చేసుకునేందుదుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లకు స్వయంగా విన్నవించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మోర్త వెంకటేశ్వరరావు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ మాజీ సర్పంచ్ గుమ్మల్ల సాగర్ పార్టీమాజీ కార్యదర్శి సరెళ్ళ సత్యనారాయణ సర్పంచ్ కుమ్మరి మాధవి రమణ క్షణముక్తేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ కుసుమ బహుగుణ పినిపే ప్రభుదాస్ ఐటీడీపీ అధ్యక్షుడు వార అశోక్
వార లక్ష్మీనరసింహం గ్రామ శాఖ అధ్యక్షుడు కాకర లక్ష్మణ్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి పంబల కృష్ణ మాజీ ఎస్సీ సెల్ కార్యదర్శి జంగప్రసాద్ మాజీ సర్పంచ్ పెట్ట పండు పరమట నాని బడుగు దొరబాబు మోరంపూడి టింకు ఎం.బాలాజీ ఎం.రాజశేఖర్ సిహెచ్ .మహాలక్ష్మి బి రాజ్ కుమార్ ఎం వెంకటేష్ పి. మధు కిరణ్ ఎం సతీష్ నందిక కిరణ్ జి.రమేష్ దాసి రాంబాబు సత్తిరాజు పి.బాలకృష్ణ సిహెచ్.లోవరాజు తదితరులు పాల్గొన్నారు