ఏరియా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి సంక్రాంతి కానుక రూ.65₹ వేలు ఇచ్చిన మంత్రి సుభాష్

పండుగ అంటే.. ప్రతి ఇంట్లోనూ సందడే.. అందులోనూ తెలుగు వారికి అతి ప్రీతిపాత్రమైన సంక్రాంతి అంటే ఎంత సందడో..ఇష్టమో మనకు తెలియనిది కాదు.. సంక్రాంతికి అంత ప్రత్యేకత ఉంది మరి. ఈ మహా సంక్రాంతిని ప్రతి కుటుంబం ఆరోగ్యం,ఆనందం,సిరి సంపదలుతో సంతోషంగా జరుపుకోవాలని కోరు కోనివాళ్లు ఎవరుంటారు..? కొత్త బట్టలు.. పిండి వంటలు.. బంధుగణం రాకపోకలు.. ఒకటేమిటి అంతా హడావిడే. మరి తక్కువ ఆదాయంతో కుటుంబాలను పోషించుకునే వాళ్ళ సంగతి ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? వారు పడే బాధలు ఎప్పుడైనా చూశారా.. కనీసం ఊహించారా… సేమ్ అలాగే ఆలోచించారు మన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ వైపు వెళుతూ గేటు దగ్గర విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ ను చూశారు మన మంత్రి సుభాష్. వెంటనే ఆయన కాన్వాయ్ ( కారు) ఆగిపోయింది.. చకచగా కారు దిగి అటు నేరుగా సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న వారి దగ్గరికి వెళ్లారు. ఎలా ఉన్నారు అంటూ వారితో కరచాలనం చేశారు.. అంతా బాగున్నారా.. అని ప్రేమగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మా మంత్రి సుభాష్ మాకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అని అంతులేని ఆనందం ఇతరులతో పంచుకునే లోపే మంత్రి సుభాష్ ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున మొత్తం 13 మంది సెక్యూరిటీ గార్డులకు రూ. 65 వేలు సంక్రాంతి కానుకగా అందించారు. మంత్రి సుభాష్ ఆత్మీయ పలకరింపుతో పులకరించి పోయిన సెక్యూరిటీ గార్డులు సంక్రాంతి కానుక కూడా ఇవ్వడంతో వారి ఆనందాలకు అవధులు లేవు. అయ్యా మంత్రిగారు మీరు మానవత్వంతో చేసే సేవా కార్యక్రమాలు ఆ నోటా ఈ నోటా ప్రతిరోజు వింటున్నాం.. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం.. చల్లగుండు మారాజా అంటూ దీవించారు.. కీర్తించారు. మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇటీవల ముచ్చుమిల్లి రోడ్డులోని JMB వికలాంగుల ఆశ్రమ పాఠశాలలో ఉంటున్న 65 మంది దివ్యాంగులను బస్సులో రిలయన్స్ ట్రెండ్స్ షాపింగ్ మాల్ కి నేరుగా దగ్గరుండి తీసుకొచ్చి వారికి నూతన వస్త్రాలు అందించిన విషయం తెలిసిందే. ఇలా ప్రతిరోజు తనకు తోచిన విధంగా మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం అందిస్తూ తన సేవా కార్యక్రమాలు రోజురోజుకీ విస్తరిస్తున్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే తపనతో చేపట్టే పనులు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు రామచంద్రపురం చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు. మంత్రి సుభాష్ గారు మంచి మనసుతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాలు మరింత ముందుకు వెళ్లాలని.. ఆయన ఆశయాలు నెరవేరాలని.. మంత్రి సుభాష్ గారు, ఆయన కుటుంబం మంచి ఆరోగ్యం, సంతోషంతో జీవించాలని మనమందరం కోరుకుందాం. మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం.. సుస్వాగతం. మానవత్వమా వర్ధిల్లాలి