
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 02:

విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కోనసీమ వలసదారుల కేంద్రం అండగా నిలిచి భరోసాను ఇవ్వడంలో కీలక భూమిక పోషిస్తుందని డిఆర్ఓ కే మాధవి తెలిపారు. నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి విదేశాలకు వెళ్లి సరైన ఉపాధి లభించక ఇబ్బం దులు ఎదుర్కొంటున్న వారిని వారు బంధువుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి స్వదేశానికి రప్పించడంలో చక్కని తోడ్పాటు అందిస్తోందన్నారు.. ఇటీవల కాలంలో స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన నెల్లి రామారావు వృద్ధ వయసులో పుట్టడు దుఃఖంతో తన భార్యతో కలిసి కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ కు వచ్చి తన గోడు ను కేంద్రం సిబ్బంది దృష్టికి తీసుకుని వచ్చారు. తన కుమార్తె చీకురుమల్లి మంగాదేవి వీధివారలంక కొత్తపేట మండలం స్థాని కంగా సరైన ఉపాధి లభించక, కుటుంబ పోషణ నిమిత్తం ఏజెంట్ ద్వారా గల్ఫ్ దేశం వెళ్ళింది కానీ గల్ఫ్ దేశం వెళ్లి మూడు నెలలు అయినప్పటికీ కూడా ఎక్కడా పనిలో పెట్టకుండా ఆఫీసులోనే ఉంచి తనను చాలా ఇబ్బంది పెట్టారనీ,మూడు నెలలు కూడా సరైన భోజనం పెట్టక వారు అమ్మాయిని కొట్టడం తిట్టడం అక్కడి నుండి వెళ్లిపొమ్మంటూ ఇబ్బంది పెట్టేవారు ఆఫీసు మేడమ్ కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు 1,50,000 కట్టి నువ్వు మీ ఇంటికి వెళ్లాలని ఆఫీసు మేడం మా అమ్మా యిని చిత్రవాద చేసింద న్నారు. మా అమ్మాయి చీకురుపల్లి మంగాదేవి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకొని వృద్దులుగా ఏమీ చేయ లేనటువంటి పరిస్థితుల్లో కొందరి సలహా మేరకు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం లో జిల్లా కలెక్టర్ వారు డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఏర్పాటు చేశారని అందులో అర్జీ పెట్టుకుంటే వారు చొరవ తీసుకుని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని మాకు తెలిసిన వారు చెప్పిన సమాచారంతో మేము వెంటనే అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఉన్న కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఆశ్రయించి కన్నీరు మున్నేరు అయ్యామన్నారు వెంటనే స్పందించిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు ముసలివారైనా వారిద్దరికి ధైర్యం చెప్పి మీ అమ్మాయికి ఏ సమస్య లేకుండా స్వదేశానికి తీసుకువస్తా మని హామీ ఇచ్చి ఏజెంట్ మరియు అక్కడ ఆఫీస్, రాయబార కార్యాలయంతో తో మాట్లాడి వెంటనే చికురుమిల్లి మంగాదేవిని స్వదేశానికి తీసుకురావడం జరిగిందని కేంద్రం నోడల్ అధికారి కే మాధవి సమ న్వయకర్త జి రమేష్ తెలిపారు.