V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మే 26:

కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రసిద్ధి చెందిన, కోనసీమ కేర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా సోమవారం వెల్లడించారు. మరి ముఖ్యంగా:-ఎవరైనా క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కారెం రవితేజా ఎండి సూచించారు.
దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా.. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ సోమవారం ఉదయం 8గంటల వరకు రాష్ట్రాల వారీగా కొవిడ్ యాక్టివ్ కేసుల వివరాలు పరిశీలిస్తే.. కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్ (83), తమిళనాడు (69), కర్ణాటక (47), ఉత్తరప్రదేశ్ (15), రాజస్థాన్ (13), పశ్చిమబెంగాల్ 12, పుదుచ్చేరి 9, హరియాణా 9, ఏపీ 4, మధ్యప్రదేశ్ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్గఢ్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.