ప్రభుత్వ సేవలు సంతృప్తిగా పౌరులకు అందించాలి: జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

v9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 8:

ప్రభుత్వ సేవలు పౌరులకు అందించడంలో సంతృప్తి స్థాయిలలో పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి అన్నారు. మంగళవారం అమరావతి నుండి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి జయలక్ష్మి మరియు కార్యదర్శి ఎన్ ప్రభాకర్ రెడ్డిలు వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించి అందరికీ ఇల్లు భూముల క్రమబద్ధీకరణ- 2025, గృహాల మంజూరు కై దరఖాస్తు చేసిన లబ్ధి దారుల కుల ధ్రువీకరణ పత్రాలు విచారణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వినతుల పురోగతి సంతృప్తి స్థాయిలు పెంపుదల అంశాల పురోగ తిపై సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు బరియల్ గ్రౌండ్స్ లేని గ్రామాలలో నిర్మాణానికి రాబోయే మూడు సంవ త్సరాలలో చర్యలు తీసు కోవాలన్నారు. ప్రభుత్వ సేవలను ప్రతి అంశం పట్ల సంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలని ఆదేశించారు ఇప్పటికే ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న సంతృప్తి స్థాయిలు తక్కువగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు గ్రామ సచివాలయాల ద్వారా పాజిటివ్ నెగిటివ్ అంశాల ను విశ్లేషించి ప్రజల సంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలని ఆదే శించారు. ఆర్ ఓ ఆర్ ముటేషన్లు, వన్ బి , పట్టా దారు పాస్ పుస్తకాలు జారీ, అంశాలలో ఆశించిన పురోగ తి లేదని మెరుగుపరచాల న్నారన్నారు.ప్రభుత్వ సూచనలకు అను గుణంగా పిజిఆర్ఎస్ సమస్యల పరిష్కారానికై మెరుగైన పనితీరు కనపరి చి రిటైర్మెంట్ అయిన తాహ సిల్దార్, ఉప తాహసి ల్దార్లను నియమించుకొని వారికున్న అనుభవం సలహాలు సూచనలతో పూర్తిస్థాయిలో అర్జీలపై విచారిస్తూ నూటికి నూరు శాతం సంతృప్తి స్థాయిలను చేరుకోవాలన్నారు. రెవెన్యూ సదస్సులలో అందిన సమ స్యల పరిష్కారానికి ఇదేవి ధంగా చర్యలు గైకొంటూ మోడల్ రోల్ పోషించాల న్నారు. ఎల్పీఎంలు విభజన జరగని మూలంగా అన్న దాత సుఖీభవ తల్లికి వందనం పథకాల అమలు లో తిరస్కరణ గురైన లబ్ధిదారులకు మరల దరఖాస్తులను విచారించి విభజన ప్రక్రియ నిర్వహించి అర్హులకు ఒక అవకాశాన్ని ఇవ్వాలన్నారు. ప్రతి అంశాన్ని పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకుని వెళ్లి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు బేసిక్ రికార్డు ఆధారంగా భూ పరిపాలన ఫిర్యాదులను పరిష్కారానికి చర్యలు గైకొనాలన్నారు. వివిధ అంశాలపై మండ లాల వారీగా కార్యా చరణ ప్రణాళికలు రూపొందించు కొని అందరూ ముందుకు సాగాలన్నారు. భూ సర్వే ప్రక్రియ డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలన్నారు గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రామ సభలు నిర్వహణ తర్టి నోటిఫికేషన్ పిఓఎల్ఆర్ జారీ ఫైనల్ నోటిఫికేషన్ జారీ అంశాలను పార దర్శకంగా నిర్వహించి భవిష్యత్ తరాలకు వివాదరహిత భూములను డిజిటల్ రూపంలో అందిం చేందుకు చర్యలు గైకొనాల న్నారు. హైలెట్ రీ సర్వే, రెండవసారి సర్వేలను నిర్దేశిత కాలవ్యవధులను పూర్తి చేయాలన్నారు. ప్రతి అంశానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా ముఖ్యమని ఆ ప్రకారం ఫైనల్ నోటిఫి కేషన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్పీఎంలు విభజించి క్రాస్ ఇన్సూరెన్స్ బుక్ చేయించాలని ఆదే శించారు ఎల్పీఎంల విభజన అంశాలపై ప్రాపర్ గా దృష్టి సారించి విభజిస్తూ అర్హులందరికీ న్యాయం చేకూర్చాలని అన్నారు అందరికీ ఇళ్లు కార్యక్ర మంలో భాగంగా లబ్ధిదా రుల కుల ధ్రువీకరణ పై విచారించాలని ఆదేశిం చారు. త్వరలో డిజిటల్ పాస్ పుస్తకాలు వస్తాయని పాత పాస్ పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూ యజ మాన్యాలకు అందించాల్సి ఉంటుందన్నారు. రెగ్యులర్గా భూ పరిపాలన రీ సర్వే అంశాలపై మండల స్థాయి నుండి సమీక్షిస్తూ ఆశించిన పురోగతిని తీసుకుని రావా లన్నారు. 706 లేఔట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి అర్హులకు అందిం చాలన్నారు ఈ కార్యక్ర మంలో డిఆర్ఓ రాజకు మారి ఆర్డీవోలు కే మాధవి, పి శ్రీకర్ డి అఖిల తదితరు లు పాల్గొన్నారు

Related Articles

మెగాస్టార్ ను కలిసిన బన్నీ

ఆదివారం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి చిరంజీవిని క‌లిశారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో అరెస్ట్ అయిన బ‌న్నీ జైలు నుంచి రిలీజైన త‌ర్వాత చిరంజీవిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా […]

అక్కడే మకాం వేసిన ఎమ్మెల్సీ ఆశావాహులు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి మార్చి 09: నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు […]

కొండుకుదురు గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు .

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సు కు తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ హాజరైయ్యారు.ఆమె […]

ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా 1100 అమలాపురం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 20: ఈనెల 21 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక […]