
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరo మే 26:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం మండలం శేరిలంక నుండి కె. గంగవరం వెళ్లే మార్గమధ్యమంలోని ముమ్మిడివరం మండలం కమిని గ్రామంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ లో హాజరయ్యేందుకు కాకినాడ శేరిలంక మండపేట, గ్రామానికి చెందిన బాలురు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి గల్లంతు అయిన వారి వివరాలు: 1,సబ్బతి క్రాంతి మాన్యు వర్, వయస్సు 19 సంవ త్సరాలు, (కాకినాడ), 2,సబ్బతి పాల్, వయస్సు 18 సంవత్సరాలు (కాకి నాడ),3, తాటిపూడి నితీష్ వయస్సు 18 సంవత్సరాలు (కాకి నాడ)4. ఎలమర్తి సాయి 18 సంవత్సరాలు (కాకి నాడ)5.రోహిత్ (మండపేట) 6 పంపే మహేష్, 14 సంవత్స రాలు (శేరిలంక) 7. వడ్డీ రాజేష్ (శేరిలంక) 8.వడ్డీ మహేష్ 14 సంవత్స రాలు (శేరిలంక) కు చెందిన వారు ఉన్నారు ముమ్మరంగా గాలింపు చర్యలు జరుగుతు న్నాయి. ఈ గాలింపు చర్యలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కృష్ణారావు అదనపు ఎస్పీ ప్రసాద్, ఆర్డీవోలు డి అఖిల కే మాధవి, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.