అంబెడ్కర్ కోనసీమ జిల్లా వరి రైతులకు కలెక్టర్ వాతావరణ హెచ్చరిక.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 17:రాబోయే మూడు రోజులు వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి రైతాంగం వరి కోతలు వాయిదా వేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ బాల సరస్వతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ధాన్యం రైతులతో సంబంధం ఉన్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు గ్రామాలలో ప్ర భుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించే రెవెన్యూ అధికారులు, గ్రామపంచాయతీ సెక్రటరీలు రైతులకు అందు బాటులో ఉండి ఇప్పటికే కల్లాల మీద ఉన్న ధాన్యాన్ని తడవకుండా కాపాడేం దుకు అవసరమైన తార్పాలిన్లు అందించాలన్నారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి రైతులను అప్రమత్తం చేస్తూ వరి కోతలు వాయిదా వేసుకునే విధంగా రైతులను చైతన్య పరచాలని. తుఫాన్ ప్రభావిత జిల్లాలలో కోనసీమ జిల్లా కూడా ఉందని వాతా వరణ శాఖ ప్రకటించిందన్నా రు.కళ్ళల్లో దాన్యం ఆరబెట్టు కున్న రైతులకు ధాన్యాన్ని జాగ్రత్త చేసుకోమని తరవ కుండా చర్యలు తీసు కోమని సూచనలు జారీ చేయాల న్నారు. ప్రస్తుతం కోత కోయని వరి పంట ఉంటే కోతలు వాయిదా వేసుకోమని సలహా ఇవ్వాలన్నారు. వీలైనంత మేరకు సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు ఎక్కడైతే కోతలు పూర్తి కాలేదో ఆ మండలాల తాసిల్దార్లు మండల పరిషత్ అధి కారు లు మండల వ్యవసాయ అధికారులు సమన్వయంతో రైతులకు తగిన సూచనలు ఇస్తూ ధాన్యానికి భద్రత కల్పి స్తూ రైతాంగానికి అండగా నిలిచి భరోసాను ఇవ్వాల న్నారు. జిల్లావ్యాప్తంగా జిల్లాలో ఉన్న 371 రైతు సేవా కేంద్రాల ద్వారా 33 వేల 66 రైతుల నుండి ఒక లక్ష 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని ఇప్పటివరకు సేకరించడం జరిగిందని అదేవిధంగా ధా న్యం సొమ్ములు రూ 443 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు.