అత్యంత వైభవంగా వినియోగదారుల దినోత్సవం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మలాపురం డిసెంబర్ 19: ఈనెల 24 తేదీ నిర్వహించబోయే జాతీయ వినియోగదారుల దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి పౌర సరఫరాల సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాల సిబ్బందితో సమావేశం నిర్వహించి ఈ నెల 24న నిర్వహించనున్న జాతీ య వినియోగదారు దినోత్సవ వేడుకల సన్నద్ధతపై సమీక్షించారు.
ఏడాది నిర్దేశించిన డిజిట ల్ న్యాయవిచారణ అం శంపై ప్రజల్లో సరైన అవ గాహన కల్పించే విధంగా నిర్వహించేలా న తగిన ఏర్పాట్లు చేపట్టాలని జెల్ పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ను ఆదేశించారు వినియోగదారుల హక్కుల రక్షణ ఎంతో అవసరమైన చట్టమని తెలిపారు అత్యంత వైభవంగా నిర్వహించేం దుకు పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, ఆహార భద్రతా శాఖల పై అధికారులందరూ ఈ విషయంలో సమర్థవం తంగా పనిచేసే ప్రభుత్వా నికి మంచి పేరు తేవాలని సూచించారు.వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు.ప్రతి విని యోగదా రుడు హక్కులపై అవగాహన కలిగి ఉండా లన్నారు. జాతీయ విని యోగ దారుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసర చన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలన్నారు. వినియోగదారుల హక్కులపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉంటుందని, అక్కడి ప్రజలకు చైతన్యం చేయాలని సూచించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో వినియోగదా రులు ప్రక టనల ద్వారా చాలా మోసపోతున్నారని ప్రతి ఒక్కరూ తమ హక్కుల పట్ల చైతన్యవంతులు కావాలన్నారు వినియో గదారుల హక్కులపై అవగాహన ఉంటే వస్తు సేవలు కొనుగోలులో మోసాల నుంచి రక్షణ పొందాల న్నారు వినియోగదారుల కు జరిగిన అన్యాయం నుంచి రక్షణ పొందడానికి ఈ చట్టాన్ని సద్విని యోగం చేసుకో వాలన్నారు వినియోగదారుల హక్కు లపై పూర్తి అవగాహన తప్పని సరిగా ఉండాల న్నారు.వినియోగదారులు ఏ వస్తువునూ గుడ్డిగా నమ్మి మోసపోకూడద న్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రత్యేక సదస్సుల ద్వారా వినియో గదారుల హక్కులపై అవగాహన కల్పిం చాలన్నారు. వస్తు, సేవలు పొందే క్రమంలో హక్కులకు భంగం కలగకుండా 2020లో వినియోగదారుల హక్కుల చట్టాన్ని తీసుకువచ్చారని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న జాతీయ వినియోగదారుల దినోత్స వం లక్ష్యం చేరుకునేలా కృషి చేద్దామన్నారు. ప్రతి వస్తువు కొనుగోలుకు రశీదు తప్పనిస రిగా తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయ భాస్కర్,జిల్లా పూరి సరఫరాల మేనేజర్ బాల సరస్వతి,సహాయ సరఫరాధికారి శరత్
సహాయ మేనేజర్ నాగే శ్వరరావు.జిల్లా వినియో గదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు అరిగెల బలరా మూర్తి అమరేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నా రు.

Related Articles

D B R అంబెడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ కు 210 అర్జీలు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 23: ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తు న్న ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమ ఆర్జీలు పట్ల తూ తూ […]

పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) పలు జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ […]

బడుగు బలహీన వర్గాల సంక్షేమం….కూటమి ప్రభుత్వం లక్ష్యంగా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 05: రాష్ట్రం లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ కూటమి ప్రభుత్వం […]

ఏపీటీఎఫ్ టీచర్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన:డి ఇ ఓ

జీతాలు కోసం నిరాహార దీక్ష చేస్తున్న ఇంజనీర్లకు సంఘీభావం తెలిపిన జిల్లా ఏపీటీఫ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఏపీటీఎఫ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎన్ మునీశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం […]