V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 23:

ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తు న్న ప్రజా సమస్యల పరి ష్కార వేదిక కార్యక్రమ ఆర్జీలు పట్ల తూ తూ మంత్రంగా పరిష్కారం వద్దని రీ ఓపెన్ కు ఆస్కారం లేకుండా పూర్తి నాణ్యతతో మాత్రమే పరిష్కరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్ నందు నిర్వహించిన పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, డిఆర్డిఏ పిడి డాక్టర్ వి శివశంకర్ ప్రసాద్ డ్వామా పిడి ఎస్. మధుసూదన్ లు అర్జీదారుల నుండి సుమారుగా 210 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసంగిస్తూ అధికారులు బాధ్యతగా పనిచేస్తూ ప్రతీ సమస్యకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న ఆర్జీల పరిష్కా రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రజా అర్జీల పరిష్కారంలో జాప్యాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా అప్ర మత్తంగా ఉండాలన్నా రు. అందిన సమస్యలకు పరిష్కార చర్యల ద్వారా ప్రజా సంతృప్తిని మరింత మెరుగుపరచాలని సూచించారు. ఆర్థికపరమైన సమస్యలు మినహా, ఆర్థి కేతర సమస్యలన్నింటికీ శత శాతం పరిష్కారం చూపాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి నిబంధ నలకు అనుగుణంగా స్వీకరించిన ప్రతీ సమస్య పరిష్కారం కావాలని దీనిలో ఏమాత్రం రాజీ పడేది లేదని అర్జీల పరి ష్కారంలో బాధ్యతారాహి త్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అర్జీలను తూ తూ మం త్రంగా కాకుండా పక్కాగా నాణ్యతతో పరిష్కరించాలని,ఒక వేళ పరిష్కారానికి నోచుకోకపోతే అందుకు గల కారణాలు కూడా స్పష్టంగా అర్జీదారులకు తెలియజేయాలన్నారు.ఆర్జీల పరిష్కా రంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సుపరి పాలనే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం ద్వారా పౌరులకి మెరు గైన సేవలు అందించా లన్నారు. పి జి ఆర్ఎస్ విభాగంలో రిసెప్షన్, ఇన్ఫర్మేషన్ కౌంటర్, రిజిస్టేషన్ కౌంటర్లతోపాటు ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు వారి వద్దకే స్వయంగా వెళ్లి మర్యాదపూర్వకంగా సమస్యను అడిగి తెలు సుకొని పరిష్కారానికై తగు చర్యలు గైకొంటు న్నట్లు తెలిపారు ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వ సేవలను స్థానికంగా పౌరులకు చేరువ చేయాలన్నారు.

ముఖ్యమంత్రి వర్యుల పర్యటనలో ఇచ్చిన హామీల పురోగతిపై వారం వారం నివేదిక సమర్పిం చాలని ఆమె ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ ఎం దుర్గారావు దొర, డిసి హెచ్ఎస్ కార్తీక్ జిల్లా వ్యవసాయాధికారి బోసు బాబు జిఎం డిఐసి పీ కే పీ ప్రసాద్, ఉద్యాన అధికారి బి వి రమణ అసిస్టెంట్ లేబర్ కమి షనర్ టి నాగలక్ష్మి ఎల్ డి ఎం కేశవ వర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాష జిల్లా సహకార అధికారి ఎస్ మురళీకృష్ణ, ట్రాన్స్కో ఎస్సీ ఎస్ రాజబాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ సి హెచ్ ఎన్ వి కృష్ణారెడ్డి, డి ఐ పి ఆర్ ఓ కె లక్ష్మీనా రాయణ వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
