అంబేద్కర్ ను అవమానించిన హోం మంత్రి అమిత్ షాను తొలగించాలి
రామచంద్రపురం 19 డిసెంబర్ ప్రజా ఆయుధం::
ద్రాక్షారామంలో గురువారం దళిత,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీ.డీ.ఎస్.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్దు, జై భీమ్ సంక్షేమ సేవా సంఘం నాయకులు గుబ్బల శ్రీను, వెంటపల్లి రామకృష్ణ,కెవిపిఎస్ జిల్లా నాయకులు నూకల బలరాం లు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, పీడిత ప్రజల మహాత్ముడు దళిత, ఆదివాసి, బహు జన,మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై మనువాద, మతోన్మాద కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ లోఎగతాళిగా, అహంకారంతో మాట్లాడడం దుర్మార్గ మన్నారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే దేశ ప్రజలందరినీ అవమానించడమే అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం ప్రజలకు అందించారని, అటువంటి మహాత్మున్ని పార్లమెంట్ సాక్షిగా కించపరచడం దురదృష్ట కరమని అన్నారు. కేంద్ర హోం శాఖా మంత్రి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అమిత్ షాను పదవినుంచి తొలగించాలని,బిజెపి నుంచి సస్పెండ్ చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు చింతా రాజారెడ్డి, కెవిపిఎస్ సత్తిబాబు, కె.సింహాద్రి, డి.అబ్రహం, కె.సత్తిబాబు, పి.బాలకృష్ణ,జి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.