
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం ఏప్రిల్ 23:

ఇళ్ళ విలాస్ కు బుధవారం రాష్ట్ర కార్మిక సంక్షేమం ఫ్యాక్టరీలు మరియు బాయిలర్లు కార్మిక ఆరోగ్య భీమా సేవలు శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ విచ్చేశారు.

పోలీస్ సేవలో ఎన్నో అవార్డు అందుకున్న ఉత్తమ పోలీస్ ఇంటిలిజెన్స్ అధికారి ఇళ్ళ ఏడుకొండల 56వ జన్మదిన వేడుకలు చిరుతపుడి చిట్టి చెరువు గ్రామంలో గడిచిన ఆదివారం రాత్రి ఆయన స్వగృహం ఇళ్ళ విలాస్ నందు ఘనంగా నిర్వహించారు.

ఈ పుట్టినరోజు వేడుకకు రాష్ట్ర మంత్రి సుభాష్ ఎమ్మెల్యే గిడ్డి హాజరు కావలసి ఉండగా వారు బిజీ షెడ్యూల్ కారణం వల్ల రాలేకపోయారు.

పోలీస్ అధికారి ఆహ్వానం మన్నించి బుధవారం మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ లు ఇళ్ళ విలాస్ కు విచ్చేశారు. ఈ సందర్భంలో ఏడుకొండలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రెండు వేలమందికి విందు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకకు హాజరు కాలేనందుకు బాధపడ్డా మనీ మంత్రి ఎమ్మెల్యేలు విషయం వివరించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారి ఏడుకొండలు తల్లిదండ్రులు అత్తమామలు మరియు విలాస్ లో ఉన్న మహనీయులు గ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆ అధికారి కుటుంబం అంతా కలిసి మంత్రి ఎమ్మెల్యేలకు శాలువా పూలమాలలతో గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సత్కరించారు.

అతిధులకు గౌరవార్థంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక విందును ఆరగించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గంధం పళ్లంరాజు, శింగినిడి వేంకటేశ్వరరావు. వాసంశెట్టి వరలక్ష్మి చిన్నబాబు, తాతాజీ, తదితరులు పాల్గొన్నారు.