భూములు మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల సవరించడానికి చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 19: కోనసీమ జిల్లాలో జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సవరించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి పేర్కొన్నారు గురువారం సాయంత్రం ఆమె స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు డి ఐ జి రిజిస్టర్, జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ మున్సిపల్ కమిషనర్లు, జడ్పీ సీఈఓ డి ఎల్ డి ఓ లతో సమావేశం నిర్వహించి మా భూముల మార్కెట్ విలువలు సవరణ కు సంబంధించి విధి విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా రిజిస్టర్ మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో భూ మార్కెట్ విలువల సవ రించిన ముసాయిదా జాబితాలను ప్రదర్శించడం జరిగిందని, అదేవిధంగా Registration.ap.gov.in వెబ్సైట్ నందు ఈ ముసాయిదా జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని ప్రజలు వీటిపై తమకు ఏమైనా అభ్యంత రాలు ఉన్నట్లయితే రాతపూర్వకంగా సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు ఈ అభ్యంతరాలను పరిశీలించిన మీదట సవరించిన తుది జాబితాను ప్రభు త్వ మార్గదర్శకాలు అనుగుణంగా రూపొందించడం జరుగుతుందని ఈ యొక్క భూమి మార్కెట్ విలువ లు 2025 జనవరి ఒకటో తేదీ నుండి అమలులోకి రాను న్నాయని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డిఐజి రిజిస్టర్ బి శివరాం, జిల్లా రిజిస్టర్ సిహెచ్ నాగలింగేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈవో, రామచంద్ర పురం మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, డి ఎల్ డి వో ఎస్ త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు

Related Articles

అమలాపురం ఏపీఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 16: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో భారీ వర్షాలకు ముందు తీసుకుంటున్న ప్రాథమిక చర్యలను తెలియజేస్తోంది. సూపరింటెండింగ్ ఇంజనీర్ బి. […]

డాక్టర్ కారెం రవితేజకు ఘన సన్మానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం ఫిబ్రవరి 07: డాక్టర్ కారెం రవితేజను ముమ్మిడివరంలో ఘనంగా సత్కరించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ […]

సహజ సేంద్రియ వ్యవసాయం తోనే భూసార సంరక్షణ: జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 7: సహజ సేంద్రియ వ్యవసాయం తోనే భూసార సంరక్షణ, ఆరోగ్య భద్రత తో పాటుగా మానవాళి మనుగడకు భరోసా ఉంటుందని డాక్టర్ […]

మండపేట విజ్ఞాన్ లో సైన్స్ డే వేడుక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 28:మండపేట ఆలమూరు రోడ్డులోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని […]