మండపేట విజ్ఞాన్ లో సైన్స్ డే వేడుక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 28:మండపేట ఆలమూరు రోడ్డులోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిబింబించే లా విద్యార్థులు వివిధ రకాల ఆకృతులను రూపొందించారు. ముఖ్యంగా విద్యార్థులు తయారు చేసిన వ్యవసాయ దశలు, అనంత ప్రతిబింబాలు, నీటి సాంద్రత, ఆవిరి సంబంధిత ప్రయోగాలు ఆమ్ల ఆధారిత ప్రతి చర్యలు లావా దీపం వంటి ప్రయోగాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ ఇనప కోళ్ళ గణేష్ చౌదరి, ప్రిన్సిపాల్ బాబి, స్కూల్ ఇన్చార్జి శివప్రసాద్ లు ఈ ప్రయోగాలు తయారు చేసిన విద్యార్థులను వారికి సహకరించిన అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా గణేష్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఇటువంటి సైన్స్ దినోత్సవాలు దోహదపడతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Related Articles

సోమవారం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన షెడ్యూల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అక్టోబర్ 06:

ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 05: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ […]

ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక/250 ఫిర్యాదులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా […]

ఎమ్మార్వో వి ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉప్పలగుప్తం డిసెంబర్ 30: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గ్రామం లో రీ సర్వే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ర్యాలీ […]