V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 7:

సహజ సేంద్రియ వ్యవసాయం తోనే భూసార సంరక్షణ, ఆరోగ్య భద్రత తో పాటుగా మానవాళి మనుగడకు భరోసా ఉంటుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ రైతు సాధికారత, మున్సిపల్, స్వచ్ఛంద సంస్థలు డ్వాక్రా మెప్మారిసోర్స్ పర్సన్ లు రైతు బజార్ ఎస్టేట్ అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో సేంద్రీయ ఉత్పత్తుల సాగు మార్కెటింగ్ వినియోగంపై ఆమె సమీక్షించారు.పెరుగు తున్న ఆరోగ్య సమస్య లకు పరిష్కారం సహజ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను పండించడమే ఏకైక మార్గమని భవిష్యత్తులో పెట్టుబడి రహిత ప్రకృతి సేంద్రియ పద్ధతి లో సాగును అవలంబించాలన్నారు ప్రకృతి సేద్య విధానాలు ద్వారా సాగు క్షేత్రాలు చిన్న చిన్న కుటుంబాలలో టెర్రస్ గార్డెన్స్ పెంపకంపై స్వయంగా కంపోస్టును ఇంటిలోని తడి చెత్త తో తయారు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ టెర్రస్ గార్డెన్స్ను పెంచడం ద్వారా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కూరగాయలను పండిం చుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని ఆమె ఆకాంక్షించారు. పట్టణ ప్రాంతాలలో తడి చెత్త వ్యర్ధాలను కంపో స్టుగా రూపొందించుకొని ఆ కంపోస్టుతో టెర్రస్ గార్డెన్స్ పెంచుకునే గుడ్ ప్రాక్టీసెస్ అవలంబించే దిశగా రిసోర్స్ పర్సన్లు కృషి చేయాలని ఆదేశిం చారు స్వచ్ఛంద సంస్థలు వీటి పెంపకానికి అనువైన సాంకేతికతను మెన్యూర్ తయారీ విధి విదానాల పై తగిన సహకారం అందిస్తారన్నారు తద్వారా పట్టణాలలో వ్యర్ధ పదార్థాలు తగ్గటమే కాకుండా ప్రజలకు నాణ్యమైన ప్రకృతి కూర గాయలు లభిస్తా యన్నారు. ప్రకృతి సహజ ఉత్పత్తులైన పంటలను రైతు బజార్లులో విక్రయించాలని సూచించారు. దేవాలయాలను ప్రసాదాలు ఉచిత భోజన ఏర్పాట్లలో పురుగు మందు అవశేషాలు రహిత సహజ ఉత్ప త్తులను తప్పనిసరిగా వినియోగిం చాలని ఆదేశించారు. అయితే సాధారణ ఉత్పత్తుల కనీసం మద్దతు ధరల కంటే వీటిని 10 శాతం అదనంగా ధర చెల్లించి కొనుగోలు చేయా లన్నారు ప్రజలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటికీ సహజ వ్యవసాయ మే దివ్యౌషధం అనే సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలని సూచించారు కంపోస్టింగ్ మరియు పంట మార్పిడి వంటి పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యంగా ఉండి సేంద్రీయ పండ్లు, కూరగాయలు ధాన్యాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయన్నారు పోష కాలతో కూడిన ఈ ఉత్ప త్తులలో ఆరోగ్య ప్రయోజ నాలు మెండుగా ఉండ డంతోపాటు ఆరోగ్యం పర్యావరణం వంటి బహుళ ప్రయోజనాలు ఓనగూరడం తో పాటుగా క్యాన్సర్ ప్రమా దాన్ని తగ్గిస్తాయన్నారు. ప్రభు త్వ శాఖలైన ఉద్యాన ఆత్మ, వ్యవసాయ రైతు సాధికార సoస్త ఈ ఉత్పత్తులను విరి విగా ప్రోత్సహించి మానవ శ్రేయస్సుకు దోహదపడాల న్నారు మున్సిపల్ అధికారు లు టెర్రస్ గార్డెన్స్ యొక్క ప్రాముఖ్యత పై విస్తృతంగా అవగాహన పెంపొందిం చాలన్నారు ఈ కార్యక్ర మంలో జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు మార్కెటింగ్ అధికారిని కే విశాలాక్షి దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వి సత్యనారా యణ, రైతు సాధికార సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ కృషివల సంస్థ ప్రతినిధి అడ్డాల గోపాల కృష్ణ, మున్సిపల్ కమిషనర్ కే వి వి ఆర్ రాజు రిసోర్స్ పర్సన్ పూర్ణిమ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు