


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15:

స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలను త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం,జిఎంసి బాలయోగి స్టేడి యం నందు 79 వ స్వాతం త్ర్య దినోత్సవం వేడుకలను జిల్లాస్థాయిలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రివ ర్యులు జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్ పేరేడ్ కవాతు గౌరవ వందనం స్వీ కరించారు. తదుపరి పోలీస్ బలగాలు ఎన్. సి సీ, స్కౌట్ విద్యార్థుల, త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తదుపరి భారత దేశం సాధించిన స్వేచ్ఛాయుతానికి చిహ్నం గా శాంతి కపోతాలను ఎగుర వేశారు. అనంతరం జిల్లా వివిధ రంగాల్లో సాధిం చిన ప్రగతిని మంత్రి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితం అమర వీరుల సమిష్టి త్యాగ ఫలం బ్రిటిష్ బానిస సంకెళ్ళకు చరమ గీతం, భరతావని విముక్తి పొందిన పవిత్ర దినం మన స్వాతంత్య్ర దినోత్సవమన్నారు.ఈ సంవత్సరం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడు కలకు నయా భారత అనే ఇతివృత్తంతో వేడుకగా నిర్వహించామన్నారు.

దేశం సాధిస్తున్న పురోగతి, సాంకే తిక ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిని సూచిస్తుంద న్నా రు.ఈ వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సిందూర్ విజ యోత్సవాన్ని ప్రతి బింబిం చేలా సాంస్కృతిక గేయ నృత్య ప్రదర్శ నలు ఆహు తులను విశేషంగా అలరిం చాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పి4, అన్నార్తుల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు నిర్వహణ, వాట్సాప్ గవర్నెన్స్, అన్న దాత సుఖీభవ పీఎం కిసాన్, తల్లికి వందనం కార్య క్రమాలపై నిర్వహించిన సాంస్కృతిక గేయ నృత్య ప్రదర్శనలు ప్రజా ప్రతిని ధులను అధికారుల ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా స్వాతం త్ర్యం కోసం ప్రాణా లర్పిం చిన స్వాతంత్ర్య సమర యోధులను సభాముఖం గా స్మరించుకోవడం జరిగిం ది ఈ సాంస్కృతిక ప్రదర్శ నలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మొదటి స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో సైంట్ జోసెఫ్ స్కూల్ ఇరుసు మండ నిలిచిందని, తృతీ య స్థానంలో బాలుర జిల్లా పరిషత్ హై స్కూల్ సూర్య నగర్ నిలిచింది.14 విభాగా ల శకటాల ప్రదర్శనలో జిల్లా ఆర్థిక గణాంక శాఖ రూపొందించిన పి4 శకటానికి మొదటి బహుమతి, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ రూపొందించిన అన్న క్యాంటీన్ శకటానికి రెండవ స్థానం లభించింది.

కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ విభాగానికి మూడవ స్థానం జి ఎస్ డబ్ల్యూ ఎస్ శాఖ రూపొం దించిన వాట్సాప్ గవర్న మెంట్ మనమేత్ర యాప్ షాకటానికి నాలుగో స్థానం లభించాయి. అనంతరం 74 ప్రభుత్వ, ప్రైవేట్ విభాగాలలో విధి నిర్వ హణలో ఉత్తమ సేవలు అందించిన సుమారు 340 మందికి ప్రశంసా పత్రాలను మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాoతి, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు డిఆర్వో కొత్త మాధవి, ఆర్డీవోలు పి శ్రీకర్ డి అఖిల, బహుకరించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా స్థాయి అధికా రులు కలెక్టరేట్ ఏవో కడలి కాశీ విశ్వేశ్వరరావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు