
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 24:

పంబల కృష్ణ శానపల్లిలంక పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామానికి చెందిన స్థానిక మండల తెలుగు యువత అధ్యక్షుడు పంబల కృష్ణ పుట్టినరోజు వేడుకలుఉ స్నేహితులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం భీమా కాలనీ శానపల్లిలంక లో స్నేహితుల అభిమానుల మధ్య పుట్టినరోజు కేక్ ను కోసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపారు. పలువురు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ ద్వారా కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ ప్రస్తుతం కళాశాల అధ్యాపకుడు గా పనిచేస్తున్నారు.
